English   

శ్రీరెడ్డి కన్నీటికి కారణం?

Reason Behind Actress Sri Reddy Tearing Every Day
2018-09-01 12:57:28

స‌న్నీలియ‌న్ స‌డ‌న్ గా వ‌చ్చి సీత క్యారెక్ట‌ర్ చేస్తే ఎలా ఉంటుంది ఒక్క‌సారి ఊహించుకోండి..? ఆ ఊహ కూడా చెండాలంగా ఉంది క‌దా.. ఇప్పుడు ఓ హీరోయిన్ చెప్పిన మాట‌లు కూడా ఇలాగే ఉన్నాయి మ‌రి. ఆమె ఎవ‌రో కాదు.. మ‌హాన‌టి శ్రీ‌రెడ్డి. ఇన్నాళ్లూ చేయాల్సిన పెంటంత చేసి ఇప్పుడు నీతులు చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. అమ్మానాన్న మాట‌లు వినండి అంటూ నేటి యువ‌త‌కు నీతి వాక్యాలు వ‌ల్లిస్తుంది శ్రీ‌రెడ్డి. ఇప్ప‌టికీ తాను రోజూ ఏడుస్తూనే ఉన్నాన‌ని.. మీరు కూడా నా జీవితంలా చేసుకోకండి అంటూ చెబుతుంది ఈ భామ‌. ఏమైందో ఏమో తెలియ‌దు కానీ బుద్ధుడికి బోధిచెట్టు కింద జ్ఞానోద‌యం అయిన‌ట్లు శ్రీ‌రెడ్డికి కూడా ఇప్పుడు ఇదే జ‌రిగింది.

ఈమె ఎక్క‌డ కూర్చుందో తెలియ‌దు కానీ స‌డ‌న్ గా తెల్లారి ట్విట్ట‌ర్లో అద్భుత‌మైన సందేశాన్ని పోస్ట్ చేసింది. జీవితంలో త‌ల్లిదండ్రుల కోసం గొప్ప గురువులు లేరు.. వాళ్లు చెప్పింది వినండి.. వాళ్లే మ‌న జీవితాన్ని స‌రైన దారిలో న‌డిపించే మార్గ ద‌ర్శ‌కులు.. తాను అలా చేయ‌నందుకే జీవితం నాశ‌నం చేసుకున్నాన‌ని చెప్పింది శ్రీ‌రెడ్డి. అంతేకాదు.. అప్పుడు వాళ్ల క‌న్నీటికి తాను విలువ ఇవ్వ‌లేదు కాబ‌ట్టే ఇప్పుడు రోజూ ఏడ‌స్తున్నానంటూ ఎమోష‌న‌ల్ లైన్స్ రాసుకొచ్చింది ఈ భామ‌. అస‌లేమైందో తెలియ‌దు కానీ శ్రీ‌రెడ్డిలో వ‌చ్చిన ఈ మార్పు చూసి చాలా మందికి హార్ట్ ఎటాకులు కూడా వ‌స్తున్నాయి. మ‌రి స‌డ‌న్ గా ఈ శ్రీ‌రంగ నీతుల వెన‌క ఉన్న క‌థేంటో శ్రీ‌రెడ్డి చెబితే బాగుంటుందేమో..?

More Related Stories