English   

అల్లుడు బాగానే అమ్ముడు పోయాడు

Shailaja Reddy Alludu Overseas Release With Huge Theatres
2018-09-01 06:30:32

శైల‌జారెడ్డి అల్లుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. నాగ‌చైత‌న్య హీరోగా మారుతి తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయ‌ని తెలుసు. కానీ ఇంత‌గా ఉన్నాయ‌ని మాత్రం ఇప్పుడిప్పుడే అర్థ‌మ‌వుతుంది. ఈ చిత్ర ట్రైల‌ర్ కు తొలిరోజే 10 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. మారుతి బ్రాండ్ కు తోడు చైతూ ఇమేజ్ కూడా ఈ చిత్రానికి బాగానే ప్ల‌స్ అవుతుంది. అన్నింటికీ మించి ర‌మ్య‌కృష్ణ అత్త‌గా న‌టిస్తుండ‌టంతో సినిమా ఎలా ఉండ‌బోతుందా అనే ఆస‌క్తి అంద‌ర్లోనూ క‌నిపిస్తుంది. పైగా ట్రైల‌ర్ నిండా కామెడీతో నిండిపోయింది. దానికితోడు నాగ‌చైత‌న్య తొలిసారి పూర్తిస్థాయి కామెడీ రోల్ చేయ‌డం కూడా సినిమాకు క‌లిసొచ్చే అంశం. మారుతి ఎలాగూ కామెడీని బాగా హ్యాండిల్ చేస్తాడు.. పైగా తెలుగు ఇండ‌స్ట్రీలో అత్తా అల్లుళ్ల కాన్సెప్ట్ అంటేనే అదుర్స్ అనే సెంటిమెంట్ ఉంది. ఇవ‌న్నీ ఈ సినిమాకు క‌లిసొస్తున్నాయి. టాప్ టూ బాట‌మ్ నాగ‌చైత‌న్య లుక్ కూడా మారిపోయింది.

ట్రైల‌ర్ పూర్తిగా మాస్ ట‌చ్ లో ఉండ‌టంతో వెంట‌నే క‌నెక్ట్ అయిపోయింది. అను ఎమ్మాన్యువ‌ల్ ఇందులో చైతూకు జోడీగా న‌టిస్తుంది. ఇగో ఎక్కువ‌గా ఉన్న అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తుంది ఈమె. హీరోయిన్ కంటే ఆమె అమ్మ‌కు మ‌రో రెండు ట‌న్నులు ఇగో ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ఇద్ద‌రి ఇగోను హీరో ఎలా అణిచాడు అనేది క‌థ‌. సెప్టెంబ‌ర్ 13న ఈ సినిమా విడుద‌ల కానుంది. అమెరికాలో అయితే నాగ‌చైత‌న్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ కానుంది ఈ చిత్రం. అక్క‌డ ఏకంగా 170 లొకేష‌న్స్ కు పైగానే విడుద‌ల‌కు సిద్ధ‌మైంది అల్లుడు. మారుతి సినిమాల‌కు అక్క‌డ క్రేజ్ బాగానే ఉంటుంది. ఇదే అల్లుడుకు బాగా క‌లిసొచ్చే అంశం. సెప్టెంబ‌ర్ 12 రాత్రే భారీగా ప్రీమియ‌ర్స్ కూడా ప‌డుతున్నాయి. తాజాగా థియేట‌ర్స్ లిస్ట్ కూడా బ‌య‌టికి వ‌చ్చాయి.

 

More Related Stories