English   

గే కామెడీ వద్దు... గీత గోవిందం ముద్దు

Naga Shaurya's Nartanasala Disaster Openings Useful to Geetha Govindam
2018-09-01 14:59:22

నా సినిమా న‌చ్చ‌క‌పోతే చూడ‌కండి.. మ‌రో ప‌దిమందికి కూడా చెప్పండి బాగోలేద‌ని.. ఇలా ఏ హీరో అయిన త‌న సినిమాను ప్ర‌మోట్ చేసుకుంటాడా అంటే ఖచ్చితంగా నో అనే చెప్తారు కానీ నాగ‌శౌర్య చేసుకున్నాడు. ఎక్క‌డ క‌నెక్ట్ అయ్యాడో తెలియ‌దు కానీ న‌ర్త‌న‌శాల ప్ర‌మోష‌న్ ఇలాగే చేసాడు ఈ హీరో. కానీ ఇప్పుడు దాని ఫ‌లితం అనుభ‌విస్తున్నాడు. నిజంగానే సినిమాకు ఇప్పుడు టాక్ తేడాగా వ‌చ్చేసింది. దాంతో అడిగినా అడ‌క్క‌పోయినా కూడా ప‌దిమందికి కాదు.. మ‌రో ప‌దిమంది క‌లిపి 20 మందికి చెబుతున్నారు బాగోలేద‌ని. ఇదే సినిమాకు శాప‌మైంది ఇప్పుడు. తొలిరోజే న‌ర్త‌న‌శాల దారుణంగా ప‌డిపోయింది.

దానికితోడు హ‌రికృష్ణ అంత్య‌క్రియ‌లు కూడా అదేరోజు ఉండ‌టంతో ఓపెనింగ్స్ కూడా దారుణంగా వ‌చ్చాయి. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే అక్ష‌రాలా 10 కోట్లు షేర్ రావాలి. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే అందులో స‌గం వ‌చ్చినా అద్బుత‌మే. అది కూడా వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. అర్థం ప‌ర్థం లేని కామెడీతో సినిమాను నింపేసాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ చ‌క్ర‌వ‌ర్తి. గే కామెడీగా వ‌చ్చిన ఈ చిత్రం శౌర్య‌కు మ‌రో ఫ్లాప్ తీసుకొచ్చింది. న‌ర్త‌న‌శాల తేడా కొట్ట‌డంతో ఈ వారం కూడా మ‌రో ఆలోచ‌న లేకుండా గీత‌గోవిందం ద‌త్త‌త తీసుకుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం 55 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. ఇప్పుడు మ‌రో 5 కోట్ల‌కు పైగానే ఈ వారం తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది.

More Related Stories