English   

చరణ్ ను ఆ దేశానికి తీసుకెళ్తున్న బోయపాటి

Ram Charan Director Boyapati Movie Latest Schedule
2018-09-01 15:45:44

రంగ‌స్థ‌లం త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ లో చాలా మార్పు వ‌చ్చింది. ఈయ‌న త‌న సినిమాల విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నాడు. ఇప్పుడు బోయ‌పాటి సినిమా క‌థ విష‌యంలో కూడా చాలా కేరింగ్ గా ఉన్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్. ఖచ్చితంగా ఈ చిత్రంతో త‌న రేంజ్ మ‌రింత పెరుగుతుంద‌ని ధీమాగా చెబుతున్నాడు చ‌ర‌ణ్. పైగా బోయ‌పాటి కూడా మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు త‌గిలితే రెచ్చిపోతాడు. ఒక్క ద‌మ్ము త‌ప్ప ఈయ‌న ఫెయిల్ అయిన సంద‌ర్భాలు లేవు. దాంతో రామ్ చ‌ర‌ణ్ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం ఎవ‌రూ చేయ‌ని ప‌ని ఒక‌టి చేస్తున్నాడు బోయ‌పాటి. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమాలేవీ వెళ్ల‌లేని దేశానికి వెళ్లి షూటింగ్ చేసుకుని రానున్నారు బోయ‌పాటి-చ‌ర‌ణ్. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది.

త్వ‌ర‌లోనే యూర‌ప్ వెళ్లి అక్క‌డే నెల రోజుల పాటు రెండు పాటలు.. కీల‌క‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. యూర‌ప్ లోని అజెర్బైజాన్ అనే దేశానికి వెళ్తున్నారు చ‌ర‌ణ్-బోయ‌పాటి. అస‌లు ఇలాంటి ఓ దేశం ఉంటుంద‌నే విష‌య‌మే ఇక్క‌డ ప్రేక్ష‌కుల‌కు తెలియ‌దు. కానీ ఇప్పుడు అక్క‌డ నెల రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి. త‌న సినిమా ఖచ్చితంగా అంద‌రికంటే రిచ్ గా ఉండాల‌ని కోరుకుంటాడు ఈ ద‌ర్శ‌కుడు. పైగా నిర్మాత దాన‌య్య కూడా పూర్తిగా ఫ్రీ హ్యాండిచ్చేసాడు. ఎంత పెట్టినా కూడా త‌న‌కు హ్యాండివ్వ‌కుండా చూసుకోండి చాలు అంటున్నాడు ఈ నిర్మాత‌. సంక్రాంతికి ఈ సినిమా విడుద‌ల కానుంది. కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్. మ‌రి.. చ‌ర‌ణ్-బోయ‌పాటి క‌లిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో..?

More Related Stories