English   

సిల్లీఫెలోస్ క్లీన్ యూ కామెడీ

Allari Naresh Sunil Silly Fellows Censor Completed
2018-09-01 14:50:31

అల్లరి నరేష్, సునిల్ హీరోలుగా రూపొందిన సినిమా ‘సిల్లీ ఫెలోస్’. భీమినేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఈ నెల 7న విడుదల చేయబోతున్నారు. నిజానికి ఈ సినిమాకు ముందుగా అనుకున్న డేట్ అది కాదు. ఆ మాటకొస్తే వీళ్లు ఏమీ అనుకోలేదు. కానీ ఈ నెల 7న విడుదల కావాల్సిన పేపర్ బాయ్ ప్రీ పోన్ అయి ఆగస్ట్ 31న వచ్చింది. దీంతో ఆ డేట్ ను వీళ్లు ఆక్యుపై చేశారు. దీంతో హడావిడీగా సెన్సార్ కు వెళ్లారు. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇక గతంలో భీమినేని, అల్లరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సుడిగాడు’.

విచిత్రం ఏంటంటే.. ఈ ఇద్దరికీ ఇదే చివరి హిట్. ఆ తర్వాత వీళ్లకు హిట్ అన్నమాటే లేదు. ఈ నేపథ్యంలో వీరి కలయికలో వస్తోన్న ఈ సినిమా కూడా స్పూఫ్ ల మయంగా ఉంటుందనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని చెప్పాడు నరేష్. అంతే కాదు.. ఇకపై అస్సలు స్పూఫ్ లు చేయనని కూడా అన్నాడు. మొత్తంగా ఈ మూవీతో మళ్లీ కమెడియన్ గా యూ టర్న్ తీసుకున్న సునిల్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సొంతం, ఆడుతూ పాడుతూ స్థాయి కామెడీ మళ్లీ ఈ సినిమాలోనే చేశానని నమ్మకంగా చెబుతున్నాడు. చిత్రా శుక్లా, నందినిరాయ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తంగా సిల్లీ ఫెలోస్ ‘క్లీన్ యూ’ సర్టిఫికెట్ తో ఈ నెల 7న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారన్నమాట.

More Related Stories