English   

‘సైరా’లో మరో సర్ప్రైస్ లుక్ విడుదల

Dynamic Look of Kiccha Sudeep From Sye Raa Narasimha Reddy
2018-09-01 23:10:37

సైరా రోజు రోజుకూ హీట్ పెంచుతున్నాడు. ఇప్పటికే టీజర్ తో దుమ్మురేపిన సైరా నరసింహారెడ్డి మూవీ టీమ్ లేటెస్ట్ గా అవుకు రాజ్యానికి చెందిన రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ ‘అవుకురాజు’గా ఎవరు నటిస్తున్నారో తెలుసా.. సుదీప్. ఈగ సినిమాతో తెలుగువారికీ మోస్ట్ ఫేవరెట్ గా మారిన సుదీప్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇంకా చెబితే చిరంజీవి లుక్ కంటే సుదీప్ లుక్కే బావుందనే టాక్స్ వస్తున్నాయి. ఈ ఆదివారం అభినయ చక్రవర్తి సుదీప్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా ఒక రోజు ముందుగానే సైరాలో అతని లుక్ విడుదల చేసి ఆడియన్స్ తో పాటు అతనికీ సర్ ప్రైజ్ ఇచ్చింది మూవీ టీమ్. సౌత్ లో ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో ఒకడుగా పేరు తెచ్చుకున్న సుదీప్ ఈ సినిమాలో నటిస్తున్నాడని ముందు నుంచీ అందరికీ తెలుసు.. కానీ అతను ఏ పాత్ర చేస్తున్నాడు. ఎలా ఉంటాడు అనేది ఊహించలేకపోయారు. బట్.. అందర్నీ సర్ ప్రైజ్ చేస్తూ సుదీప్ ఫస్ట్ లుక్ డైనమిక్ గా ఉందనే చెప్పాలి.

సుదీప్ లుక్ లో ఇది మైనస్ అని చెప్పడానికి ఏమీ లేదు. మీసాలు, గుబురు గడ్డం, ఆయుధాలు, అతని లుక్, అలాగే నల్లటి డ్రెస్.. అన్నీ ఆయనో తిరుగుబాటు దారుడుగా చెప్పకనే చెబుతున్నాయి. మొత్తంగా సైరా నరసింహారెడ్డి బ్రిటీష్ వారు ఇచ్చే పెన్షన్ కోసం మొదలుపెట్టే ఈ యుద్ధం ఏకంగా వారికి వ్యతిరేకంగా మొదలవుతుంది. ఈ క్రమంలో బ్రిటీష్ వారు నరసింహారెడ్డిపై కక్ష కడతాడు. దీంతో అతను ఇతర పరగణాలు, చిన్న చిన్న రాజులందరినీ కూడగట్టి ఏకంగా బ్రిటీష్ వారిపైనే యుద్ధం ప్రకటిస్తాడు. ఈ పోరాటంలో ఆయన చనిపోతాడు. మొత్తంగా హిస్టారికల్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది అనేదానికి సంకేతంగా ఒక్కొక్క లుక్కూ బయటకు వస్తున్నాయి.


 
ఇక ఈ మూవీలో మెగాస్టార్ సరసన నయనతార నటిస్తుంది. ఆయన గురువుగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు. అలాగే తమన్నా, సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక హాలీవుడ్ లో ది బెస్ట్ యాక్షన్ సినిమాలకు పనిచేసిన గ్రెగ్ పావెల్ అండ్ టీమ్ ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ కోసం పనిచేస్తున్నారు. మొత్తంగా అత్యంత భారీదనంతో రూపొందుతోన్న ఈ మూవీలో కొత్తగా వచ్చిన సుదీప్ ఫస్ట్ లుక్ అద్భుతం అనే చెప్పాలి.

More Related Stories