English   

గీత తోనైనా వర్మ రాత మారేనా..?

Ram Gopal Varma Coming With Bhairava Geetha Bold Content
2018-09-02 00:10:23

రామ్ గోపాల్ వర్మ.. అని మనకో టాలెంటెడ్ దర్శకుడు ఉండేవాడు. ఉండేవాడు అని పాస్ట్ టెన్స్ లో ఎందుకు చెప్పామో అందరికీ తెలుసు. తెలుగులో ఇక ఆయన ఏం చేసినా క్రేజ్ రావడం లేదు. దీంతో కన్నడకు వెళ్లాడు. అతని లాస్ట్ హిట్ అక్కడే వీరప్పన్ తో వచ్చింది. దీంతో వర్మకు అక్కడ కాస్త క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తో ఇప్పుడక్కడ ఓ సినిమా నిర్మించాడు. భైరవగీత అనే టైటిల్ తో వస్తోన్న ఈ మూవీ తెలుగులోనూ విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా ఆ ట్రైలర్ విడుదల చేశారు.

మామూలుగా ఏమీ లేని చోటే ఏదో ఉందనేలా హైప్ చేస్తుంటాడు వర్మ. ఇక కన్నడవారికి కాస్త కొత్తగా ఉండే ఈయన వ్యవహారాలు.. అక్కడ క్రేజీగానే ఉన్నాయి. అందుకే భైరవగీత అంచనాలు పెంచే పనిలో పడ్డాడు. అది కూడా సోషల్ మీడియాలోనేలే. అక్కడ హీరోగా సక్సెస్ కాక ఈ మధ్యే విలన్ గా మారిన ధనుంజయ అనే కుర్రాడిని హీరోగా పెట్టి.. తీసిన సినిమా ఇది. ఐరా మోర్ అనే బ్యూటీని హీరోయిన్ గా పరియం చేస్తున్నాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి సిద్ధార్థ్ తాతోలు దర్శకుడు.

భైరవ గీత ట్రైలర్ కొంత వరకూ ఆకట్టుకునేలానే ఉంది. కానీ వర్మ ట్రైలర్స్ తో మాత్రమే ఆకట్టుకోవడం మొదలయ్యి కూడా చాలాకాలం అయింది కదా అందుకే పూర్తిగా నమ్మలేం. అలాగని అతని ప్రతిభనూ తక్కువ అంచనా వేయలేం. ఓ పెద్దింటి అమ్మాయి.. పేదింటి కుర్రాడు మధ్య నడిచే కథ అని అర్థమౌతోంది. దీనికి సీమ ఫ్యాక్షనిజం తోడయ్యాక ఏం జరిగింది.. అనే చూస్తే తెలుస్తుంది. ఇక ఇందులోనూ ఓ ఘాటైన అధర చుంబనం ఉండటం విశేషం. ఏదేమైనా డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బావుండు అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ సినిమాను తెలుగులో అభిషేక్ పిక్చర్స్ వాళ్లు విడుదల చేయబోతుండటం మరో విశేషం.

 

More Related Stories