English   

వ్య‌క్తిత్వంలో ఆకాశం.. ప‌వ‌న్ ను అందుకోవ‌డం క‌ష్టం..

Difficult to reach Pawan Kalyan Personality
2018-09-02 05:06:18

రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అంద‌రికీ సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు. సాధారణంగా పొలిటిక‌ల్ లైఫ్ మొద‌ల‌య్యాక ఎవ‌రిపై అయినా బుర‌ద జ‌ల్ల‌డం ఖాయం. కానీ ప‌వ‌న్ పై బుర‌ద జ‌ల్ల‌డం అంటే మాట‌లు కాదు. ఎందుకంటే అక్క‌డ పెద్ద‌గా జ‌ల్ల‌డానికి విమ‌ర్శ‌ చేయ‌డానికి అత‌డి ద‌గ్గ‌ర ఏమీ కార‌ణాలు ఉండ‌వు. అందుకే అంద‌రూ ప‌వ‌న్ ను టార్గెట్ చేయ‌డానికి ప‌ర్స‌న‌ల్ లైఫ్ ను వాడేస్తుంటారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అమ్మాయిల‌ను డ్ర‌స్ లు మార్చేసిన‌ట్లు మారుస్తుంటాడ‌ని ఇష్ట‌మొచ్చిన‌ట్లు కామెంట్లు చేస్తుంటారు. ఎందుకంటే ప‌వ‌న్ ను విమ‌ర్శించాలంటే ఇది త‌ప్ప మ‌రో కార‌ణం దొర‌క‌ని గొప్ప వ్య‌క్తిత్వం ఈయ‌న సొంతం.

సాయం చేయ‌డంలో ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ ను మించిన వాళ్లు లేరు. ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా కూడా ముందుగా స్పందించేది ఈయ‌నే. ఎంతోమందికి గుప్త‌దానాలు చేసి.. వ్య‌క్తిత్వంలో ఆకాశం అనిపించుకున్నాడు ప‌వ‌ర్ స్టార్. తాను క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యాల్లో కూడా అవ‌త‌లి వాళ్ల క‌ష్టాలు అర్థం చేసుకునేంత గొప్ప మ‌న‌సున్న హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్. అందుకే ఈయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాడంటే ఎందుకీ రొచ్చు అని బాధ ప‌డిన వాళ్ల‌తో పాటు వ‌స్తే ఏదో ఒక‌టి చేస్తాడు అని న‌మ్మిన వాళ్లు కూడా ఉన్నారు. అంద‌రి ఆశీస్సుల‌తోనే ప‌వ‌న్ ఇప్పుడు ఒంటరిపోరు చేస్తున్నాడు. ఈయ‌న వ్య‌క్తిత్వ‌మే ఈయ‌న‌కు శ్రీ‌రామ‌ర‌క్ష‌గా ఉందిప్పుడు.

More Related Stories