English   

అక్కినేని ఫ్యామిలీలో వార్

Samantha Naga Chaitanya Nagarjuna Sumanth Box Office September War
2018-09-02 05:57:04

ఇండస్ట్రీలో స్టార్ వార్స్ కామనే. కానీ ఫ్యామిలీ వార్సే అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అరుదైన వార్ ఒకే ఫ్యామిలీలో రెండు సార్లు జరగబోతుండటం మాత్రం రేర్. ఈ రేర్ ఫీట్ కు రీల్ స్టార్స్ గా నిలిచింది అక్కినేని ఫ్యామిలీ. ఇప్పటికే సమంత, నాగ చైతన్య వేర్వేరు సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. ఇదే చాలామందిలో ఇంట్రెస్ట్ కలిగిస్తుంటే లేటెస్ట్ గా మరో ఇద్దరు ఫ్యామిలీ స్టార్స్ బాక్సాఫీస్ వార్ కు సై అంటున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ దృష్టంతా వీరిపైనే పడింది. సమంత నటించిన యు టర్న్, నాగ చైతన్య నటించిన శైలజరెడ్డి అల్లుడు సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఎవరు హిట్ అవుతారు... ఎవరు ఫట్ అవుతారు అనేది పక్కన బెడితే ఇలా ఫ్యామిలీ స్టార్స్ బాక్సాఫీస్ వార్ లో తలపడుతుండటం మాత్రం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. మరి చైతూ, శామ్ తర్వాత వార్ కు రెడీ అయిందెవరో తెలుసా.. నాగార్జున, సుమంత్.

అక్కినేని ఫ్యామిలీలో మూడో తరం వారసుడిగా ముందుగా ఎంట్రీ ఇచ్చింది సుమంత్. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ఇక సుమంత్ పని అయిపోయింది అనుకుంటోన్న టైమ్ లో రీసెంట్ గా మళ్లీరావా అంటూ మరో హిట్ కొట్టి బరిలో నిలిచాడు. ఇప్పుడు ఇదం జగత్ అనే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో వస్తున్నాడు. ఈ మూవీలో అతను క్రైజ్ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. ఈ మూవీని ఈ నెల 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. అయితే ఆ ముందు రోజే వస్తున్నట్టు నాగార్జున దేవదాస్ తో అనౌన్స్ చేశాడు.

నాగార్జున, నాని మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న సినిమా దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ మూవీని అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత అశ్వనీదత్ నిర్మాత చైర్ లో కూర్చున్న సినిమా ఇది. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ స్టార్స్ తో రూపొందిన మల్టీస్టారర్ కాబట్టి ఈ మూవీపై అంచనాలు బానే ఉన్నాయి. వీళ్లు ఈ నెల 27న వస్తున్నట్టు ముందే ప్రకటించారు. అంటే ఆ తర్వాత రోజు సుమంత్ వస్తున్నాడు. మరి ఈ వార్ లో విన్నర్ ఎవరో కానీ.. చాలా యేళ్ల తర్వాత టాలీవుడ్ లో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు స్టార్స్ ఒకే నెలలో ఇలా బాక్సాఫీస్ వార్ కు సిద్ధపడటం ఇదే మొదటిసారి. అందుకే ఈ వార్స్ పై టాలీవుడ్ ఇంట్రెస్టిగ్ గా ఉంది.

More Related Stories