English   

జ‌న‌సేనానితో జనం న‌డుస్తారా..?

Will Powerstar Pawan Kalyan Reach The Power
2018-09-02 08:18:06

ఇదివ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే సినిమా హీరో.. ప‌వ‌ర్ స్టార్ అని ప్రేక్ష‌కులు గుర్తుంచుకునే వాళ్లు. అభిమానులు కూడా ప‌వ‌న్ పేరు చెబితే ఒంట్లో క‌రెంట్ పాస్ అయిన‌ట్లు ఉంటారు. ఇప్పుడు ఈయ‌న సినిమాలు వ‌దిలేసి రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు. ఇక్క‌డ కూడా దుమ్ము దులిపేస్తాడ‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.. మ‌రోవైపు ప్ర‌జ‌లు కూడా ఏదో మంచి చేస్తాడ‌ని న‌మ్ముతున్నారు. ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీ స్థాపించి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నాడు ఈ జ‌న‌సేనాని. ఇక ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈయ‌న ఏం చేస్తాడు అనేదానిపైనే ఇప్పుడు ఇండ‌స్ట్రీలోనూ.. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ జోరుగా జ‌రుగుతుంది. దీనికి ప‌వ‌న్ వైపు నుంచి స‌మాధానం రావ‌డం కాస్త క‌ష్టంగానే ఉంది కానీ ఖచ్చితంగా ఏదో ఒక‌టి చేస్తాడ‌నే మొండి న‌మ్మ‌కం మాత్రం అభిమానుల్లో క‌నిపిస్తుంది. చిరంజీవి కూడా ఒక‌ప్పుడు ఇలాగే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాడు. మెగాస్టార్ నుంచి జీరోస్టార్ అయి మ‌ళ్లీ సినిమాల్లో స‌త్తా చూపిస్తున్నాడు.

అయితే ఇప్పుడు అన్న‌య్య చేసిన త‌ప్పు తాను చేయ‌నంటున్నాడు ప‌వ‌ర్ స్టార్. అప్పుడంటే అనుభ‌వం లేక ప్రజారాజ్యం విష‌యంలో త‌ప్పు చేసాన‌ని.. ఇప్పుడు ఖచ్చితంగా ప్ర‌జ‌ల‌కు తానేంటో.. త‌న రాజ‌కీయ చతుర‌త ఏంటో చూపిస్తానంటున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అయితే ఈయ‌న మాట‌ల్లో చెప్పినంత ఈజీగా ప‌నులు జ‌రిగిపోతాయా అంటే అంత సుల‌భం కాదు. ఎంద‌కుంటే జ‌న‌సేన‌లో ప‌వ‌న్ త‌ర్వాత సెకండ్ గ్రేడ్ లీడ‌ర్ మ‌రొక‌రు లేరు.. క్యాడ‌ర్ కూడా క‌నిపించ‌దు. ఇలాంటి ఆయ‌న్ని న‌మ్మి ఏ ప్ర‌జ‌లైనా ఎందుకు ఓట్లేస్తార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇందులో కూడా నిజం లేక‌పోలేదు. కానీ ప‌వ‌న్ మాత్రం ఖచ్చితంగా జ‌న‌సేన‌తో జ‌నాల్లోకి వెళ్ళడం కాదు.. అధికారంలోకి కూడా వ‌స్తానంటున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ కూడా చేస్తున్నాడు ఈయ‌న‌. మ‌రి జ‌న‌సేనాని ప‌క్క‌న జ‌న‌సేన నిల‌బ‌డుతుందో లేదో..?

More Related Stories