English   

ప‌వ‌ర్ ఆఫ్ టాలీవుడ్

Pawan Kalyan to PowerStar Journey in Tollywood
2018-09-02 02:09:09

అద్భుత‌మైన న‌టుడా అంటే కాద‌నే స‌మాధాన‌మే వ‌స్తుంది.. చూపు తిప్పుకోలేని అంద‌గాడా అంటే అదీ కాద‌నే స‌మాధాన‌మే వ‌స్తుంది.. పోనీ ఒళ్లు మ‌రిచిపోయి డాన్సులు చేస్తాడా అంటే నో అంటారు.. ఓహో చేసిన సినిమాల‌న్నీ స‌క్సెస్ అయ్యాయేమో అందుకే అభిమానులు అంత‌గా ప‌డి చ‌స్తారు అనుకుంటే పొర‌పాటే.. ఇందులో ఏ ఒక్క క్వాలిటీ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ లో క‌నిపించ‌దు. కానీ ఎందుకో తెలియ‌దు ఈయ‌న్ని చూడ‌గానే ఒంట్లో తెలియ‌కుండానే వెయ్యి ఓల్టుల క‌రెంట్ పాస్ అవుతున్న‌ట్లుంటుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే పేరులోనే ఏదో మాయ ఉంది.. మ‌త్తు ఉంది.. ఆయన ప‌వ‌ర్ చూస్తుంటే బాక్సాఫీస్ తెలియ‌కుండానే ఊగిపోతుంది.

సినిమా ఎలా ఉన్నా కూడా ఓపెనింగ్స్ లో రికార్డులు సృష్టించే స‌త్తా ఉన్నా ఏకైక హీరో తెలుగు ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్. అక్క‌డ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో ఇండ‌స్ట్రీకి చిరు త‌మ్ముడుగా వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్.. అన‌తి కాలంలోనే అన్న‌కు త‌గ్గ త‌మ్ముడు అనిపించుకున్నాడు. వ‌ర‌స‌గా గోకులంలో సీత‌.. సుస్వాగ‌తం.. తొలిప్రేమ‌.. త‌మ్ముడు.. బ‌ద్రి.. ఖుషీ లాంటి సినిమాల‌తో అన్న‌ను మించిన త‌మ్ముడు అయిపోయాడు. సౌత్ లో ర‌జినీకాంత్ కు మాత్ర‌మే ఈ స్థాయి ఫాలోయింగ్ ఉంది. అది మ‌ళ్లీ ప‌వ‌న్ కే చూస్తాం.

అభిమానులు కూడా ఈయ‌న హీరోయిజం.. సినిమాల‌ కంటే కూడా వ్య‌క్తిత్వాన్ని చూసి ఇష్ట‌ప‌డ‌తారు. అందుకే ఖుషీ త‌ర్వాత 12 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేక‌పోయినా ప‌వ‌న్ ను త‌మ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు అభిమానులు. ఫ్లాప్ సినిమాల‌తో కూడా కొంద‌రు హీరోల హిట్ సినిమాల కంటే ఎక్కువ వ‌సూలు చేసాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. మ‌ళ్లీ 2012లో గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆరేళ్ల కిందే ఈ చిత్రం 69 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది.

ఆ మ‌రుస‌టి ఏడాది అత్తారింటికి దారేదితో 80 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసాడు. అప్ప‌ట్నుంచి మొన్న‌టి అజ్ఞాత‌వాసి వ‌ర‌కు మ‌ధ్య‌లో అన్నీ ఫ్లాపులే వ‌చ్చినా కూడా ప‌వ‌న్ కు ఏ మాత్రం ఇమేజ్ త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ ఆయ‌న‌తో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు పోటీ ప‌డుతూనే ఉంటారు. అదీ ఆయ‌న రేంజ్.. స్టామినా. ఇప్పుడు కూడా రాజ‌కీయాలు మానేసి సినిమాల్లోకి వ‌స్తానంటే నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు నిర్మాత‌లు. ఇక ఆయ‌న రావ‌డ‌మే ఆల‌స్యం.

More Related Stories