English   

సమంతకు యు టర్న్ తిప్పలు తప్పట్లేదు

Samantha Got Two Shocks From Sivakarthikeyan and Naga Chaitanya
2018-09-02 09:50:00

పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం స్పీడ్ తగ్గించకుండా దూసుకుపోతోన్న సమంత లేటెస్ట్ మూవీ ‘యూ టర్న్’ హార్రర్ అండ్ మర్డర్ థ్రిల్లర్ గా రాబోతోన్న ఈ మూవీ ఈ నెల 13న విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ అదే రోజు విడుదలవుతుంది. అఫ్ కోర్స్ అమ్మడికి అక్కడ కూడా మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయనుకుంటున్నారు. బట్ అమ్మడికి కొత్తగా ఓ షాక్ తగిలింది. ఇటు తెలుగులోనూ ఎటొచ్చీ ఈ డేట్ లో తెలుగులో నాగ చైతన్యతో ఫైట్ తప్పలేదు. ఈ సినిమాకు నిర్మాత కూడా తనే అంటున్నారు. కానీ తను కాదంటోంది. అవన్నీ పక్కన బెడితే సమంతకు తమిళ్ లో కొత్త షాక్ తగిలింది. తను తమిళ్ లో నటించి సీమరాజా కూడా అదే రోజు విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు.

తమిళ్ లో స్వయంకృషితో ఎదిగిన స్టార్ గా శివకార్తికేయన్ కు మంచి పేరుంది. మనోడు నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే రేంజ్ పెరుగుతోంది. అందుకే సమంత అతనితో నటించేందుకు ఒప్పుకుంది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ కోలీవుడ్ ఆడియన్స్ కు తగ్గట్టుగా ప్రామిసింగ్ గా కినపిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. విలేజ్ టీజర్ గా సమంత కనిపిస్తోంది. మరి ఈ సినిమా కూడా అదే రోజు విడుదలైతే సమంత యూ టర్న్ ఓపెనింగ్స్ కు షాక్ తగులుతుంది. ఇటు శైలజా రెడ్డి వల్ల అదే షాక్ తగులుతోంది. అంటే అమ్మడికి తెలుగు, తమిళ్ లో ఒకే రోజు డబుల్ షాక్ తగలబోతోందన్నమాట. కాకపోతే తన సినిమా బావుంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఇద్దరికీ తనే షాక్ ఇచ్చే రేంజ్ సమంతది. మరి ఎవరి వల్ల ఎవరు షాక్ తింటారో చూద్దాం..

More Related Stories