English   

'మా' అసోసియేష‌న్ నిధులు ఏం అయ్యాయి

Allegations on Movie Artist Association (MAA) President Sivaji Raja
2018-09-02 13:21:23

మా అసోషియేష‌న్ మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కింది. అక్క‌డ ఏం జ‌రిగినా కూడా ఇప్పుడు మీడియా కూడా బాగా హైలైట్ చేస్తుంది. ఒక‌ప్పుడు అది కూడా కేవ‌లం మూవీస్ వ‌ర‌కు మాత్ర‌మే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ప్రేక్ష‌కులు కూడా ఈ మా అసోషియేష‌న్ పై ఓ క‌న్నేసి ఉంచుతున్నారు. అక్క‌డేం జ‌రుగుతుంది.. ఎవ‌రెవ‌రు ఎప్పుడు కొట్లాడుకుంటున్నారు అనేది కూడా చూస్తున్నారు. ఇక ఇప్పుడు మ‌రోసారి ఇలాంటి ర‌చ్చ మొద‌లైంది. మూడేళ్ల కింద మా అధ్యక్ష ఎన్నికల సమయంలో రాజేంద్రప్రసాద్, జయసుధలలో ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలనే విషయమై జరిగిన ర‌చ్చ‌తో మా ప‌రువు గంగ‌లో క‌లిసిపోయింది. నిజ‌మైన ఎన్నిక‌లు సైతం ఇంత రంజుగా సాగుతాయా అనేంత‌గా అప్పుడు ర‌చ్చ చేసారు మ‌న ఇండ‌స్ట్రీ పెద్ద‌లు.

ఆ త‌ర్వాత శివాజీ రాజాను ఏకగ్రీవంగా ఎన్నుకొని ‘మా’ అధ్యక్షుడిగా నియమించారు. అయితే ఇప్పుడు ఈయ‌నపై కూడా కొన్ని అలిగేష‌న్స్ వ‌స్తున్నాయి. ‘మా’ నిధులు స్వాహా అయ్యాయని.. లోలోప‌లే అంతా మింగేస్తున్నారు అంటూ విభేధాలు బ‌య‌టికి వ‌చ్చాయి. సెప్టెంబ‌ర్ 1 రాత్రి చాలా సేప‌టి వ‌ర‌కు అక్క‌డ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో దీనికి సంబంధించిన చ‌ర్చ జ‌రిగింది. దాంతో ‘మా’ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో శివాజీ రాజా మొత్తం వివరణ ఇవ్వడంతో నరేష్ తృప్తి చెందారు. కుటుంబంలో ఎప్పుడైనా గొడ‌వ‌లు వ‌చ్చిన‌పుడు కూర్చుని మాట్లాడుకుంటాం క‌దా.. ఇప్పుడు మేం కూడా అదే చేస్తున్నాం అంటూ చ‌ర్చ‌ను ముగించారు న‌రేష్. మ‌రి ఈ ర‌చ్చ ఇక్క‌డితో ఆగిందా లేదంటే మ‌ళ్లీ మొద‌ల‌వుతుందా అనేది చూడాలి.

More Related Stories