English   

బాల‌య్య చైత‌న్య‌ర‌థం ఎన్టీఆర్ ఎక్కుతాడా..?

Will Jr NTR Join Hands To Balakrishna For NTR Biopic
2018-09-02 17:27:38

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇన్నాళ్లూ నో అనే వ‌చ్చేది. ఎందుకంటే బాల‌య్య‌కు ఎన్టీఆర్ తో ఈ మ‌ధ్య కాలంలో పెద్ద‌గా ప‌డ‌టం లేదు. ఇద్ద‌రూ ఎక్క‌డా క‌లిసింది కూడా లేదు. చాలా రోజులుగా ఈ కుటుంబాల మ‌ధ్య తెలియ‌ని అగాధం వ‌చ్చేసింది. అయితే ఇప్పుడు అది లేదు. దేవుడు ఒక‌టి తీసుకెళ్తే మ‌రోటి క‌చ్చితంగా ఇస్తాడ‌న‌డానికి ఇప్పుడు నంద‌మూరి కుటుంబ‌మే నిద‌ర్శ‌నం. జాన‌కిరామ్ పోయిన‌పుడు ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ప్రాణం కంటే ఎక్కువ‌గా చేరువ‌య్యారు. ఇప్పుడు హ‌రికృష్ణ పోవ‌డంతో బాల‌య్య ఈ కుటుంబానికి చేరువ‌వుతున్నారు. చాలా ఏళ్ళ త‌ర్వాత అబ్బాయిల‌తో అన్నీ మ‌న‌సు విప్పి మాట్లాడుతున్నాడు బాల‌య్య‌.

ఈ సీన్ చూసి నంద‌మూరి అభిమానులు కూడా హ‌రికృష్ణ మ‌ర‌ణానికి అర్థం ఉంద‌ని కాస్తైనా మ‌న‌సు కుదుట చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో హ‌రికృష్ణ‌గా ఎన్టీఆర్ న‌టిస్తాడేమో అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. క్రిష్ ఈ పాత్ర కోసం ఇప్ప‌టికే క‌ళ్యాణ్ రామ్ ను తీసుకోవాల‌ని చూస్తున్నాడు. అయితే బాల‌య్యే స్వ‌యంగా ఎన్టీఆర్ ఈ పాత్ర చేస్తే బాగుంటుందంటున్నాడు. దాంతో బాబాయ్ కోరిక మేర‌కు అబ్బాయ్ మ‌న‌సు మార్చుకున్నా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. చైత‌న్యర‌థ సార‌థిగా అప్ప‌ట్లో ఎన్టీఆర్ కు అండ‌గా.. తోడుగా తొమ్మిది నెల‌ల పాటు ఉన్నాడు హ‌రికృష్ణ‌. ఇప్పుడు ఇదే పాత్ర‌ను జూనియ‌ర్ చేస్తే ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌య్య ఉంటే ఆ సీన్ చూడ్డానికి ఎంతో ముచ్చ‌ట‌గా ఉంటుంద‌ని అభిమానులు కూడా ఆశ ప‌డుతున్నారు. మ‌రి ఈ కోరిక తీరుతుందో లేదో.. తీరితే మాత్రం చ‌రిత్రే.

More Related Stories