English   

జ‌న‌సేన‌కు చిరుసేన సాయం చేస్తుందా..?

Will Chiranjeevi Fans Give Their Support to Pawan Kalyan's Janasena
2018-09-02 23:17:26

పైకి క‌నిపించ‌రు కానీ మెగా కుటుంబం మాత్రం చాలా ముదుర్లు. వాళ్లు సినిమాల్లోనే కాదు.. బ‌య‌ట కూడా అర్థం కారు. అంతా దూరంగా ఉన్న‌ట్టే ఉంటారు.. ఎవ‌రి దారి వాళ్ల‌దే అన్న‌ట్లుంటారు. కానీ స‌మ‌యం వ‌చ్చిన‌పుడు అంతా ఒక్క‌టే అంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీతో పాటు మెగా కుటుంబం న‌డుస్తుందా న‌డ‌వ‌దా..? అన్న‌య్య కాంగ్రెస్ లో ఉన్నాడు క‌దా.. ఇప్పుడు త‌మ్ముడి ద‌గ్గ‌రికి వ‌స్తాడా రాడా అనే అనుమానం చాలా మందిలో ఉంది. అయితే ప‌వ‌న్ ఒంట‌రిగానే వ‌స్తాడు.. అన్న‌య్య అండ‌దండ‌లు తీసుకోడు అనేది ఇన్నాళ్లూ బలంగా వినిపించిన మాట.

ఇప్ప‌టికీ ప‌వ‌ర్ స్టార్ ఆలోచన ఇదే. చిరు వ‌స్తే త‌న పార్టీ మ‌రో ప్ర‌జారాజ్యం అయిపోతుంద‌నే అనే భ‌యం కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ లో ఉంది. అయితే ఇప్పుడు తీరు చూస్తుంటే మెగా కుటుంబం అంతా క‌లిసిక‌ట్టుగా ఇప్పుడు జ‌న‌సేన వెంట న‌డిచేలా క‌నిపిస్తుంది. ప‌వ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఒక్కొక్క‌రు ఒక్కోలా ఈయ‌నకు బ‌ర్త్ డే విషెస్ చెప్పారు. చ‌ర‌ణ్ గాల్లో చెబితే.. బ‌న్నీ అనుకున్న‌ది సాధించాలి  బాబాయ్ అన్నాడు.. ఇక త‌మ్ముడికి కోరుకున్న‌ది ల‌భించాలంటూ అన్న‌య్య కూడా ఆప్యాయంగా త‌న శుభాకాంక్ష‌ల‌ను తెలిపాడు. ఇలాంటి స‌మ‌యంలో ఈ సీన్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా జ‌న‌సేన‌తో పాటు మెగా సేన కూడా ఉంటుంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది.

పైగా బాబాయ్ అడ‌గాలే కానీ ఏం చేయడానికి అయినా తాను సిద్ధ‌మే అని ఇదివ‌ర‌కే చెప్పాడు రామ్ చ‌ర‌ణ్. ఇక చిరు కూడా కోరితే త‌మ్ముడి త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తాడేమో..? మ‌రోవైపు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి.. దాంతో ఎవ‌రి స్ట్రాట‌జీలు వాళ్లు వేసుకుంటున్నారు.. ఎవ‌రి లెక్క‌లు వాళ్లు వేసుకుంటున్నారు.. ఇప్పుడు ప‌వ‌న్ కూడా త‌న జ‌న‌సేన బ‌లాన్ని పెంచుకోవాల‌నుకుంటున్నాడు. అయితే ఈయ‌న వ‌ల‌స‌ల్ని కానీ.. పెద్ద పెద్ద లీడ‌ర్స్ ను కానీ త‌న పార్టీలోకి రమ్మ‌ని అడ‌గ‌ట్లేదు.. ఓ వైపు ఎన్నిక‌లు స‌మీపిస్తున్నా కూడా ప‌వ‌న్ వ్యూహం ఏంటో రాజ‌కీయ పండితుల‌కు కూడా అర్థం కావ‌ట్లేదు.

సెకండ్ గ్రేడ్ లీడ‌ర్ లేకుండా.. స‌రైన క్యాడ‌ర్ లేకుండా ఎల‌క్ష‌న్ బ‌రిలోకి ప‌వ‌న్ ఎలా దిగుతాడో తెలియ‌క తిక‌మ‌క‌ప‌డుతున్నారు కార్యకర్త‌లు కూడా. అయితే ఇప్పుడు మ‌రో షాకింగ్ న్యూస్ బ‌య‌టికి వ‌చ్చింది. మూడున్న‌ర ద‌శాబ్ధాలుగా చిరు అభిమాన సంఘంలో ఉన్న కొంద‌రు అభిమానులు ఇప్పుడు ప‌వ‌న్ జన‌సేన‌లో చేర‌బోతున్నారు. చిరు అభిమాన సంఘం అధ్య‌క్షుడు స్వామి నాయుడుతో పాటు మ‌రి కొంద‌రు జ‌న‌సేన‌లో జాయిన్ కాబోతున్నారు. అయితే ఇది చిరంజీవి వ్యూహ‌మా.. లేదంటే అన్న‌య్య సినిమాల్లో ఉన్నాడు కాబ‌ట్టి రాజ‌కీయంగా త‌మ్ముడికి స‌పోర్ట్ చేయాల‌ని అభిమానులు సొంతంగా తీసుకున్న నిర్ణ‌య‌మా అనేది మాత్రం ఆస‌క్తిక‌రంగా మారింది.

More Related Stories