English   

కాజ‌ల్ మాస్టర్ ప్లాన్స్ డబ్బు కోసమేనా..?

Kajal Aggarwal Master Plans For Huge Remuneration
2018-09-03 07:35:41

చంద‌మామ చంద‌మామ అంటుంటే నిజంగానే కాజ‌ల్ ను అంతా చంద‌మామ అని ఫిక్సైపోయారు. అయితే ఆ చంద‌మామ‌లో కూడా చిన్న మ‌చ్చ ఉంటుంది అనేది మ‌రిచిపోతారు ప్రేక్ష‌కులు. ఇప్పుడు కాజ‌ల్ ఇది గుర్తు చేస్తుంది. త‌న క‌న్నింగ్ ప్లాన్స్ తో పిచ్చెక్కిస్తుంది ఈ భామ‌. 30 దాటిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్ గానే కొన‌సాగుతూ కాక పుట్టిస్తుంది ఈ బ్యూటీ. ప్ర‌తీసారి అందాల వేడుక చేసి అంద‌ర్నీ ఫిదా చేస్తుంది. ఇక ఇప్పుడు కూడా ఇదే చేసింది. వ‌య‌సు త‌గ్గించుకునే ప‌నిలో భాగ‌మో లేదంటే పోటీ త‌ట్టుకోలేక అందాలు ఆర‌బోయాల‌నే క‌సో తెలియ‌దు కానీ అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా ప్ర‌తీసారి కాజ‌ల్ మాత్రం అందాల క‌నిక‌ట్టు చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. ప‌ద్ద‌తిగా చూస్తూనే క‌సెక్కించే చూపుల‌తో ప్రాణాలు తీస్తుంది ఈ చంద‌మామ‌. మొన్న‌టి వ‌ర‌కు స్టార్ హీరోల‌తోనే సినిమాలు చేసిన కాజ‌ల్.. ఇప్పుడు చిన్న హీరోలైనా ప‌ర్వాలేదు అంటుంది.

త‌న‌కంటే ఇమేజ్ లో చిన్న‌వాడైన హీరోతో న‌టించ‌డానికి రెండో సారి కూడా ఒప్పుకుందంటే ఒక‌టి పారితోషికం భారీగా ముట్టుండాలి.. రెండు క‌థంతా త‌న‌పై అయినా న‌డుస్తూ ఉండాలి. ఇప్పుడు కాజ‌ల్ కు ఈ రెండూ క‌లిసొచ్చాయి. తేజ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ప‌దేళ్ల కింద ల‌క్ష్మీక‌ళ్యాణంతో త‌న‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసాడ‌నే కృత‌జ్ఞ‌త‌తో ఇప్ప‌టికీ గురువుగారు అంటూ తేజ వెంట తిరుగుతుంది కాజ‌ల్. గ‌తేడాది కూడా నేనేరాజు నేనేమంత్రిలో రానాతో రొమాన్స్ చేసింది. ఇక ఇప్పుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాలో మ‌రోసారి రొమాన్స్ చేస్తుంది. ఇప్ప‌టికే ఓ సినిమాలో ఈ కుర్రాడితో న‌టిస్తుంది కాజ‌ల్. అంత‌లోనే మ‌రో ఆఫ‌ర్ అందుకుంది. స్టార్ హీరోలు ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోయినా చిన్న హీరోల‌కు మాత్రం కాజ‌ల్ పెద్ద వ‌రంలా మారిపోయింది. తేజ సినిమాతో పాటు శ‌ర్వానంద్ సినిమాలోనూ న‌టిస్తుంది ఈ భామ‌. క‌థ‌కు క‌థ‌.. డ‌బ్బుకు డ‌బ్బు వ‌స్తుండ‌టంతో మ‌రో ఆలోచ‌న లేకుండా హాట్ ఫోటోషూట్స్ తో పాటు చిన్న సినిమాల‌కు కూడా సైన్ చేస్తుంది కాజ‌ల్.

More Related Stories