English   

పవర్ స్టార్ ను వాడేస్తున్న విజ‌య్ దేవరకొండ

VIjay Devarakonda Starting Campaigning With Pawan Kalyan Blessings
2018-09-03 09:52:05

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనేది ఇప్పుడు ప‌బ్లిక్ ప్రాప‌ర్టీ. ఎవ‌రు ప‌డితే వాళ్లు వాడేసుకుంటున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా అంతా ప‌వ‌ర్ స్టార్ ఇమేజ్ ను వాడుకుంటున్నారు. మెగా కుటుంబ హీరోలు మాత్ర‌మే ప‌వ‌న్ ను వాడుకోవాల‌నే రూల్ ఇక్క‌డ లేదు. నితిన్ అయితే వాళ్ల కంటే ఎక్కువే వాడేసాడు. ఇప్ప‌టికీ ప‌వ‌న్ ను వాడుకోవ‌డంలో నితిన్ ను మించిన వాళ్లు లేరు. అయితే ఇప్పుడు మ‌రో హీరో కూడా త‌యారైపోయాడు ప‌వ‌న్ వాడ‌కంలో. ఈ మ‌హా ముదురెవ‌రో కాదు విజ‌య్ దేర‌వ‌కొండ‌. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ అయిపోయిన ఈయ‌న‌.. ఇప్పుడు ప‌నిలో ప‌నిగా ప‌వ‌న్ ను వాడుకుంటే ఇంకా ఎక్కువ ఇమేజ్ తెచ్చుకోవ‌చ్చ‌ని భావిస్తున్నాడు. అస‌లే ప్లానింగ్ లో మ‌నోడు మాస్ట‌ర్. అందుకే ఇప్పుడు ఇది అమ‌లు చేస్తున్నాడు. అస‌లు విష‌యం ఏంటంటే విజ‌య్ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు బ‌ర్త్ డే విషెస్ చెప్పాడు.

ఇందులో విశేషం ఏం లేదు కానీ అందులోనే చిన్న మ‌త‌లబు కూడా పెట్టాడు. ప‌వ‌న్ కు శుభాకాంక్ష‌లు చెబుతూనే.. తాను రేప‌ట్నుంచి ప్ర‌చారం మొద‌లుపెడ‌తాన‌ని చెప్పాడు. అంటే సెప్టెంబ‌ర్ 3 నుంచి అన్న‌మాట‌. ఏ ప్ర‌చారం అనుకుంటున్నారా.. ఇంకే ప్ర‌చారం సినిమా ప్ర‌మోష‌న్ అన్న‌మాట‌. ఈయ‌న ప్ర‌స్తుతం నోటా సినిమాలో న‌టిస్తున్నాడు. ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో కావాల్సిన‌న్ని రాజ‌కీయాలు ఉండ‌బోతున్నాయి. అందుకే ప్ర‌మోష‌న్ ను ప‌వ‌న్ ఆశీస్సుల‌తో మొద‌లుపెడుతున్నాడు ఈ హీరో. ప‌వ‌న్ బ‌ర్త్ డే విషెస్ తో పాటు పెడితే ఈ విష‌యం ఇంకా ఎక్కువ మంది ప్రేక్ష‌కుల‌కు రీచ్ అవుతుంది క‌దా.. అలా ప్లాన్ వేసాడు విజ‌య్. మొత్తానికి ఇండ‌స్ట్రీ మొత్తానికి ప‌వర్ స్టార్ ఇమేజ్ ఊరికే దొరికేసింది. అందుకే అంతా వాడేసుకుంటున్నారు.

More Related Stories