English   

స‌మంత దెయ్యం.. ప‌డలేనంటున్న నాగ‌చైత‌న్య‌.. 

Samantha-naga-chaitanya
2018-09-03 11:12:43

అదేంటి.. ఒక‌రి కోసం ఒక‌రు అన్న‌ట్లుండే స‌మంత‌, నాగ‌చైత‌న్య ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా..? ఇది ఇండ‌స్ట్రీ బాబూ.. ఎవ‌రిని అయినా ఇలాగే మార్చేస్తుంది. ఇప్పుడు కూడా చైతూ ఇలా మారిపోయాడు. అస‌లు విష‌యం ఏంటంటే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఏ ఇద్ద‌రిని క‌దిపినా కూడా అక్కినేని వారి పోరు గురించే మాట్లాడుకుంటున్నారు. భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ వ‌చ్చి సెప్టెంబ‌ర్ 13న త‌మ సినిమాల‌తో పోటీకి సై అంటే సై అంటున్నారు. శైల‌జారెడ్డి అల్లుడు వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ముందు ఆగ‌స్ట్ 31 అనుకున్న తేదీ కాస్తా రెండు వారాలు ఆల‌స్యంగా వ‌స్తుంది. అయితే త‌న సినిమాను విడుద‌ల చేయాల‌నే కంగారులో భార్య స‌మంత‌నే మ‌రిచిపోయాడు నాగ‌చైత‌న్య‌. అయితే ఆ త‌ర్వాత మెల్ల‌గా స‌మంత‌కు వెళ్లి త‌న సినిమా విష‌యం చెప్పాడు చైతూ. 

అప్పుడు నిజంగానే యు ట‌ర్న్ సినిమాలో దెయ్యంలా ఫేస్ పెట్టింద‌ని.. తొలిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తే నువ్వొచ్చి నా సినిమాపైనే ప‌డ‌తావా అంటూ అరిచేసింద‌ని చెప్పాడు చైతూ. అయితే ఇద్ద‌రూ డిఫెరెంట్ సినిమాలు చేసారు.. రెండు భిన్న‌మైన కాన్సెప్టులు.. పైగా వినాయ‌క‌చ‌వితి సెల‌వులు ఉన్నాయి కాబ‌ట్టి స‌మ‌స్య లేద‌ని డిస్ట్రిబ్యూట‌ర్లే త‌మ‌కు ధైర్యం చెప్పార‌ని గుర్తు చేసుకున్నాడు చైతూ. అంతేకాదు త‌న సినిమాను భార్య‌.. స్యామ్ సినిమాను తాను ప్ర‌మోట్ చేస్తామ‌ని చెప్పాడు ఈ హీరో. త‌న సినిమాతో పాటు భార్య సినిమాను కూడా చూడాలంటూ అత్త మామ‌ల‌తో పాటు బామ్మ‌ర్దుల‌కు కూడా చెప్తానంటున్నాడు చైతూ. అయినా ఇంత మంచి భ‌ర్త ఎక్క‌డ దొరుకుతాడు స‌మంత‌కు చెప్పండి..?

More Related Stories