English   

కేసీఆర్ ను బీట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. 

Geetha-Govindam
2018-09-03 12:21:41

కేసీఆర్ ను విజ‌య్ బీట్ చేయ‌డం ఏంటి..? అస‌లు వీళ్లిద్ద‌రికి ఎక్క‌డ పోలిక కుదిరింది అనుకుంటున్నారా..? ఉంది.. సెప్టెంబ‌ర్ 2న తెరాస‌కు కీల‌క‌మే. ఆ రోజు ప్ర‌గ‌తి నివేద‌న స‌భ పెట్టాడు కేసీఆర్. అయితే ఈ స‌భ కంటే కూడా గీత‌గోవిందం సినిమాకు ఎక్కువ మంది ప్రేక్ష‌కులు వ‌చ్చారు. గీతగోవిందం సినిమా హాల్స్ అన్నీ మూడో ఆదివారం కూడా నిండిపోయాయి. అన్నిచోట్లా హౌజ్ ఫుల్స్ తో క‌ళ‌క‌ళ‌లాడిపోయింది. ఇక్క‌డే కాదు.. చెన్నై, కేర‌ళ‌లో కూడా గీత‌గోవిందం దూకుడు సాగుతుంది. అక్క‌డ కేసీఆర్ స‌భ‌లో అయినా అక్క‌డ‌క్క‌డా ఖాళీ ప్లేస్ క‌నిపించింది కానీ ఇక్క‌డ గీత‌గోవిందం స్క్రీన్స్ మాత్రం ఒక్క సీట్ కూడా ఖాళీ లేదు. ఈ చిత్ర దూకుడు చూస్తుంటే పిచ్చెక్కిపోవ‌డం ఖాయం. ప్ర‌తీవారం కొత్త సినిమాలు రావ‌డం.. గీత‌గోవిందంకు ఆహారం అయిపోవ‌డం కామ‌న్ అయిపోయింది. 

ఈ వారం కూడా ఇదే జ‌రిగింది. న‌ర్త‌న‌శాల కూడా గీత‌గోవిందానికి చిక్కిపోయాడు. ఇప్ప‌టికే 17 రోజుల్లో 60 కోట్ల‌ షేర్ వ‌సూలు చేసి.. 115 కోట్ల గ్రాస్ ఖాతాలో వేసుకున్నాడు విజ‌య్ దేవ‌రకొండ‌. ఇది చూసిన త‌ర్వాత ఇంకెవ‌రైనా విజ‌య్ ను చిన్న హీరో అంటే అంత‌కంటే బూతు మ‌రోటి ఉండ‌దు. ఈయ‌న ఇమేజ్ ఇంత‌గా పెరిగిపోయింది అని బ‌హుశా ఆయ‌న‌కు కూడా తెలియ‌లేదేమో..? ఈ సినిమా ప్ర‌భంజ‌నం ఇప్ప‌ట్లో త‌గ్గ‌డం కూడా క‌ష్ట‌మే. ఎలా చూసుకున్నా మ‌రో వారం రోజుల పాటు గీత‌గోవిందం ర‌చ్చ సాగ‌డం ఖాయం. మూడో వీకెండ్ లో కూడా ఈ చిత్రం క‌నీసం 6 కోట్లు వెన‌కేసుకుంది. సెప్టెంబ‌ర్ 13న శైల‌జారెడ్డి అల్లుడు.. యు ట‌ర్న్ వ‌చ్చేంత‌వర‌కు కూడా ఈ సినిమా ర‌చ్చ ఆప‌డం క‌ష్టం. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్ర ఫైన‌ల్ ర‌న్ ఎక్క‌డివ‌ర‌కు వ‌చ్చి ఆగుతుందో..? 

More Related Stories