English   

కామ‌న‌ర్స్ ను కామ‌న్ గా పంపించేసారే..!

Nutan-Naidu
2018-09-03 07:07:25

ఒకేవారం ఇద్ద‌రు కామ‌న్ మ్యాన్ బిగ్ బాస్ ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చేసారు. కొన్ని వారాలుగా సేఫ్ అవుతూ వ‌స్తున్న గ‌ణేష్ ఎట్ట‌కేల‌కు ఇంటి నుంచి ఔట్ అయిపోయాడు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 85 రోజుల నుంచి సేఫ్ అవుతూనే ఉన్నాడు ఈ కుర్రాడు. అస‌లు కామ‌న్ మ్యాన్ గా వ‌చ్చి ఇన్నాళ్లు ఉండ‌ట‌మే చాలా ఎక్కువ‌. ఎందుకంటే కామ‌న‌ర్ గా వ‌చ్చిన సంజ‌న తొలివారం ఎలిమినేట్ కాగా.. నూత‌న్ నాయుడు రెండో వారం వెళ్లి మ‌ళ్లీ ఐదో వారంలో రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ గ‌ణేష్ మాత్రం ఒక్కొక్క‌ర్ని దాటుకుంటూ 12 వారాలు ఇంట్లోనే ఉన్నాడు. అయితే గ‌త వారం ఈయ‌న కౌశ‌ల్ తో పెట్టుకున్న గొడ‌వ కాస్తా సీరియ‌స్ కావ‌డంతో మ‌నోన్ని బ‌య‌టికి పంపేసారు ప్రేక్ష‌కులు. ఇక కౌశ‌ల్ ఆర్మీ కూడా ఇందులో కీల‌క హ‌స్త‌మే. ఎందుకంటే బ‌య‌ట పెద్ద యుద్ధ‌మే జ‌రుగుతుంది ఈ ఆర్మీ పేరుతో.
 
ఇక ఈయ‌న‌తో పాటు మ‌రో కామ‌న‌ర్ నూత‌న్ నాయుడు కూడా ఈ వారం బ‌య‌టికి వ‌చ్చేసాడు. ఈయ‌న కూడా ఒకేసారి మ‌రో కామ‌న‌ర్ తో క‌లిసి బ‌య‌టికి వ‌చ్చేసాడు. ఇలా ఒక‌వారం.. ఒకేసారి ఇద్ద‌రూ కామ‌న్ మ్యాన్స్ బ‌య‌టికి రావ‌డంతో బిగ్ బాస్ మ‌రోసారి సెలెబ్రెటీ హౌజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో ఉన్న‌వాళ్లంతా సెలెబ్రెటీసే. త‌నీష్.. సామ్రాట్.. కౌశ‌ల్.. గీతామాధురి.. అమిత్.. శ్యామ‌ల‌.. వీళ్ల‌లో వ‌చ్చే వారం నుంచి ఎవ‌రెవ‌రు ఒక్కొక్క‌రుగా బ‌య‌టికి వ‌స్తార‌నేది చూడాలి. అంతేకాదు.. సీజ‌న్ చివ‌ర్లోకి రావ‌డంతో మ‌ధ్య‌లో కూడా స‌డ‌న్ ఎలిమినేష‌న్స్ త‌ప్ప‌వు. మొత్తానికి ఇప్ప‌ట్నుంచి షో రేటింగ్ ఇంకా పెంచాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు నిర్వాహ‌కులు. నాని కూడా త‌న‌వంతుగా బాగానే హోస్టింగ్ చేస్తున్నాడు. ఇక చూడాలి.. సీజ‌న్ పూర్త‌య్యేలోపు ఎన్టీఆర్ రేటింగ్ ను ఒక్క‌సారైనా నాని అందుకుంటాడో లేదో..?

More Related Stories