English   

ప్ర‌భాస్ ప్రేమకు డేట్ దొరికింది.. 

prabhas-radha-krishna
2018-09-03 15:44:13

అస‌లే పెళ్లి కావాల్సిన కుర్రాడు.. ప్ర‌భాస్ పెళ్లి కోసం అభిమానులే కాదు మొత్తం ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తుంది. బాహుబ‌లి త‌ర్వాత చేసుకుంటాను అన్నాడు కానీ ఇప్పుడు సాహో త‌ర్వాత అంటున్నాడు. చూస్తుంటే అప్ప‌టికి కూడా చేసుకునేలా క‌నిపించ‌డం లేదు. ఇక ఇప్పుడు ఈ హీరో ప్రేమ‌లో ప‌డ్డాడు. ప్ర‌భాస్ ను ప్రేమ‌లో ప‌డేసిన అమ్మాయి ఎవ‌రు అనుకుంటున్నారా..? ఇక్క‌డ ప్ర‌భాస్ ను ప్రేమ‌లోకి దించింది అమ్మాయి కాదు అబ్బాయి. హా.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా ఇదే నిజం. ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే రాధాకృష్ణ‌కుమార్ తో సినిమా చేయ‌బోతున్నాడు. ఈ ద‌ర్శ‌కుడితోనే ప్రేమ‌లో ప‌డ్డాడు ప్ర‌భాస్. అంటే ఈయ‌న క‌థ‌తో అన్న‌మాట‌. యాక్ష‌న్ సినిమాలు చేసి చేసి బోర్ ఫీల్ అవుతున్న ఈ యంగ్ రెబ‌ల్ స్టార్ తో పూలు ప‌ట్టించే ప‌నిలో బిజీగా ఉన్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. 

డార్లింగ్ త‌ర్వాత ప్రేమ‌క‌థ‌ల జోలికి వెళ్లని ప్ర‌భాస్ కు ప‌క్కా ప్రేమ‌క‌థ చెప్పి ఒప్పించాడు రాధాకృష్ణ‌. జిల్ త‌ర్వాత ఈయ‌న చేస్తోన్న సినిమా ఇది. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 6న మొద‌లు కానుంది. అయితే సాహోతో పాటు రాధా సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేస్తాడా.. లేదంటే సాహో త‌ర్వాత వ‌చ్చి ఇక్క‌డ జాయిన్ అవుతాడా అనేది తెలియాలి. 

యూర‌ప్ బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువ భాగం షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు రాధా. జిల్ త‌ర్వాత ఈయ‌న చేస్తోన్న సినిమా ఇదే కావ‌డం విశేషం. 80ల నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ సాగ‌నుంది. యాక్ష‌న్ సినిమాలు చేసి చేసి త‌న‌కు బోర్ వ‌చ్చేసింద‌ని.. కాస్త రిలీఫ్ కోసం పూర్తిగా ప్రేమ‌క‌థ చేయ‌బోతున్నాని చెప్పాడు ప్ర‌భాస్. మ‌రి ఈయ‌న ప్రేమ్ క‌హానీ ఎలా ఉండ‌బోతుందో వ‌చ్చే ఏడాది తెలుస్తుంది. అన్న‌ట్లు ఈ చిత్రంలో పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్ప‌టికే ఈమె మ‌హేశ్.. ఎన్టీఆర్ సినిమాల్లో న‌టిస్తుంది. మొత్తానికి ప్ర‌భాస్ ఆగ‌స్ట్ నుంచి ప్రేమ‌లో ప‌డ‌తాడ‌న్న‌మాట‌.

More Related Stories