English   

రాజ‌కీయాల్లోకి విజ‌య్ ముహూర్తం ఖరారు.. 

NOTA-Trailer-Release
2018-09-03 16:56:58

విజ‌య్ అంటే ఇక్క‌డ త‌మిళ హీరో విజ‌య్ కాదు.. మ‌న విజ‌య్ దేవ‌ర‌కొండే. గీత‌గోవిందం మ‌త్తు ఇంకా దిగ‌క‌ముందే మ‌రో సినిమాతో వ‌స్తున్నాడు విజ‌య్. ఈయ‌న సినిమా అంటే ఇప్పుడు ఉండే అంచ‌నాలు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న ఈ హీరో.. ఇప్పుడు ద్విభాషా చిత్రం నోటాతో వ‌స్తున్నాడు. ఈ చిత్రం కూడా అప్పుడే విడుద‌ల‌కు సిద్ధ‌మైపోయింది. రెండేళ్ల కింద విక్ర‌మ్ తో ఇరుముగ‌న్ సినిమా చేసిన ఆనంద్ శంక‌ర్ దీనికి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో చేయ‌న‌టువంటి భిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మెహ్రీన్ కౌర్ ఇందులో విజ‌య్ కు జోడీగా న‌టిస్తుంది. 

స‌త్య‌రాజ్, నాజ‌ర్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రాజ‌కీయ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న నోటా చిత్రాన్ని జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర థియెట్రిక‌ల్ ట్రైల‌ర్ సెప్టెంబ‌ర్ 6.. సాయంత్రం 4 గంట‌ల‌కు విడుద‌ల కానుంది.  నాకు ఈ రాజ‌కీయాలంటే ప‌డ‌వు.. కానీ దిగాల్సి వ‌స్తుందని ట్వీట్ చేసాడు విజ‌య్. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అక్టోబ‌ర్ లో సినిమా విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రి విజ‌య్ రాజ‌కీయాలు ఎలా ఉండ‌బోతున్నాయో చూడాలిక‌..!

More Related Stories