English   

ఈ మూస నాటకాలేంటీ బాబూ..?

Natakam-Trailer
2018-09-03 18:11:08

హీరో ఫుల్ గా గడ్డం పెంచుకుంటాడు. పల్లెటూరి వాడు. ఊరమాస్ గా ఉంటాడు. హీరోయిన్ కాస్త క్లాస్. లేదంటే అతనికి తగ్గ మాస్.. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఊరు కాబట్టి హద్దులూ దాటతారు.. ఇలాంటి కథలు తమిళ్ లో ఎన్నో వచ్చాయి. ఆ ట్రెండ్ అక్కడే ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ గడ్డం తోపాటు లిప్ లాకులు మొదలయ్యాయి. లేటెస్ట్ గా అలాంటి లిస్ట్ లో మరో నాటకం మొదలైంది.

‘నాటకం’ పేరుతో తెలుగులో కొత్తగా ఓ సినిమా రాబోతోంది. లేటెస్ట్ గా ట్రైలర్ విడుదలైంది. కానీ ఈ ట్రైలర్ చూస్తే ఎంత రొటీన్ గా ఉందో చెప్పక్కర్లేదు. ట్రెండ్ సెట్టింగ్ సినిమాలను ఏ మాత్రం కొత్తదనం లేకుండా ఫాలో అయితే ఎలా ఉంటుందో ఈ నాటకం చూస్తే తెలుస్తుంది. ఊరమాస్ హీరో ప్రేమలో పడితే ఇలా ఉంటుందన్నమాట. నిజానికి ఈ ఆహార్యం ఇప్పుడు ఏ పల్లెటూరిలోనూ కనిపించడం లేదు. అయినా మనాళ్లకు నేటివిటీ అంటే ఇలాగే ఉంటుందనే ఆలోచన ఎలా వస్తుందో మరి. ఈ ట్రైలర్ చూస్తే ఆర్టిస్ట్ లు మారిన ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా గుర్తుకు రావడం లేదూ. కాకపోతే హీరోయిన్నే వేరుగా ఉంది. 

ఈ ఫార్మాట్ లో సినిమాలు హిట్ అవుతున్నాయని అదే ఫార్మాట్ ను ఫాలో అయ్యే ఏ ట్రెండూ మంచిది అనిపించుకోదు. వీళ్లేదైనా కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తే అది ఆకట్టుకుంటుంది కానీ.. ఇలా గడ్డం పెంచుకున్న అర్జున్ రెడ్డి, రంగస్థలంలో రామ్ చరణ్, ఆర్ఎక్స్ హండ్రెడ్ ఆ హీరో హిట్లు కొట్టారని అందరూ కొట్టరు. అయినా ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది కదా.. ఇందులో ఎంత కొత్తదనం ఉంటుందో అని. మరి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మళ్లీ మన సినిమా మూసగా మారుతుందే తప్ప.. గొప్ప అనిపించుకోదు. బట్.. ఇలా ఉన్నంత మాత్రాన వీళ్ల సినిమా బావుండదు అని ఇప్పుడే చెప్పలేం. బట్.. ట్రైలర్ లోనే ఏ కొత్తదనం లేదంటే ఇంక సినిమాను మాత్రం ఎలా గొప్పగా ఊహించుకుంటాం.. 

More Related Stories