English   

జబర్దస్త్ కమెడియన్ కు అరుదైన గౌరవం

Jabardasth-Sudhakar
2018-09-03 11:33:37

జబర్దస్త్.. ఎంతో మందిలో ఉన్న టాలెంట్ ను బయటకు తీసుకువచ్చిన వేదిక. చాలాసార్లు వివాదాస్పదం అయినా.. కొందరికి ఇది వెగటు పుట్టించే కామెడీగా పేరున్నా.. మరీ అడల్ట్  కంటెంట్ ఎక్కువైందన్న విమర్శలు వచ్చినా.. యేళ్ల తరబడి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న ఈ షోద్వారా ఎంతోమంది యువకులు తమ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు.. చేసుకుంటున్నారు. ఈ షోలో నటించిన వారిలో చాలామందికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కొందరు ప్రూవ్ చేసుకున్నారు.. మరికొందరు వేరే షోస్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జబర్థస్త్ కమెడియన్ సుధాకర్ కు ఓ అరుదైన గౌరవం లభించింది. బహుశా చిన్న కమెడియన్స్ లో ఇలాంటి గౌరవం దక్కించుకున్న తొలి నటుడు అతనే కావొచ్చు.

మహబూబ్ నగర్ కు చెందిన సుధాకర్ జబర్ధస్త్ కు రాకముందు నుంచే స్టేజ్ ఆర్టిస్ట్ గా ఫేమస్. వేలాది షోస్ ద్వారా ఎందరినో నవ్విస్తోన్న అతను మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ఫన్నీ డ్యాన్సర్ కూడా. నాటి హీరోలను ఫిజికల్ గా ఇమిటేట్ చేయడంలో సుధాకర్ శైలి నవ్వులు కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో అలనాటి హీరోలు గాలిపటాలు ఎలా ఎగరేస్తారు అనే కాన్సెప్ట్ తో అతను క్రియేట్ చేసిన స్టేజ్ ఫామ్ ఎవర్ గ్రీన్. అందుకే అతనికీ ‘గాలిపటాల సుధాకర్’ అనే పేరొచ్చింది. మొత్తంగా ఇతను ఐదువేలకు పైగా స్టేజ్ షోస్ చేసినట్టు గుర్తింపు ఉంది. దీంతో అతనికి కోయంబత్తూర్ కు చెందిన ‘రాయల్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్ అనౌన్స్ చేయడం విశేషం. ఓ స్టేజ్ ఆర్టిస్ట్ కు.. అది కూడా కామెడీ స్టేజ్ ఆర్టిస్ట్ కు ఇలాంటి గౌరవం దక్కడం బహుశా సుధాకర్ కే మొదటిసారేమో. మొత్తంగా ఈ గౌరవ డాక్టరేట్ ను అతనికి దుబాయ్ లో జరిగే ఓ ఈవెంట్ లో అందజేయబోతున్నారు. 

More Related Stories