English   

విజయ్ దేవరకొండ రచ్చ ఆగట్లేదు

Viujay Devarakonda's Geetha Govindam 19 Days Box Office Worldwide Collections
2018-09-04 06:18:03

తెలుగు ఇండ‌స్ట్రీలోనే టాప్ హిట్స్ లో ఒక‌టి సొంతం చేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అర్జున్ రెడ్డితో పాత్ బ్రేకింగ్ సినిమా ఇచ్చి చ‌రిత్ర సృష్టించిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు క‌లెక్ష‌న్ల వైజ్ గా కూడా చ‌రిత్ర సృష్టిస్తున్నాడు. ఒక‌టా రెండా ఏకంగా 110 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్నాడు విజ‌య్. ఈయ‌న న‌టించిన గీత‌గోవిందం ఇప్ప‌టికీ దుమ్ము దులిపేస్తూనే ఉంది. ఇప్ప‌టికే దూకుడు.. రేసుగుర్రంతో పాటు చాలా సినిమాలు క్రాస్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు కాట‌మ‌రాయుడు 62 కోట్లు.. గ‌బ్బ‌ర్ సింగ్ 69 కోట్లు మాత్ర‌మే మిగిలాయి. ఖచ్చితంగా ఈ రెండు సినిమాల‌ను కూడా ఫుల్ ర‌న్ లో గీత గోవిందం దాటేలా క‌నిపిస్తుంది.

20 రోజుల త‌ర్వాత కూడా గీతగోవిందం సినిమా హాల్స్ అన్నీ నిండిపోయాయి. చాలా చోట్ల హౌజ్ ఫుల్స్ బోర్డులు క‌నిపిస్తున్నాయి. అస‌లు ఈ చిత్ర దూకుడు చూసి ట్రేడ్ పండితుల‌కు కూడా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. పైగా ఈ వారం నాగ‌శౌర్య న‌ర్త‌న‌శాల కూడా గీత‌గోవిందానికి చిక్కిపోయాడు. ఇప్ప‌టికే 19 రోజుల్లో 61 కోట్ల‌ షేర్ వ‌సూలు చేసి.. 110 కోట్ల గ్రాస్ ఖాతాలో వేసుకున్నాడు విజ‌య్ దేవ‌రకొండ‌. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే షేర్ 43 కోట్ల‌కు చేరింది. ఇక యుఎస్.. క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడు.. కేర‌ళ‌.. ఇలా ఏ ప్లేస్ చూసినా ఇప్పుడు గీత‌గోవిందం త‌ప్ప మ‌రో సినిమా క‌నిపించ‌డం లేదు. సెప్టెంబ‌ర్ 13న శైల‌జారెడ్డి అల్లుడు.. యు ట‌ర్న్ వ‌చ్చేంత‌వర‌కు కూడా ఈ సినిమా ర‌చ్చ ఆప‌డం క‌ష్టం. మ‌రి.. ఈ చిత్ర ఫైన‌ల్ ర‌న్ ఎక్క‌డివ‌ర‌కు వ‌చ్చి ఆగుతుందో..?

More Related Stories