English   

తెలంగాణ‌కు రాజ‌మౌళి ఫుల్ స‌పోర్ట్

Director SS Rajamouli Mentoring Telangana Premier  Kabaddi League
2018-09-04 06:50:27

అవును.. ఇప్పుడు తెలంగాణ‌కు త‌న ఫుల్ స‌పోర్ట్ అంటున్నాడు రాజ‌మౌళి. పైగా ఈయ‌న ఇప్పుడు క‌బ‌డ్డి కూడా ఆడ‌తానంటున్నాడు. అయినా ఇప్పుడు కొత్త‌గా ఆడుకోవ‌డం ఏంటి మ‌న పిచ్చి కాక‌పోతేనూ.. త‌న విజ‌యాల‌తో బాక్సాఫీస్ ను.. త‌న దూకుడుతో మిగిలిన ద‌ర్శ‌కుల‌ను.. త‌న మార్కెట్ తో హీరోల‌ను ఎప్ప‌ట్నుంచో క‌లిపి క‌బడ్డీ ఆడుకుంటున్నాడు క‌దా.. ఇప్పుడు కొత్త‌గా ఆడ‌టం ఏంటి అనుకుంటున్నారా..? అవును నిజ‌మే కానీ ఇప్పుడు నిజ‌మైన క‌బడ్డి ఆడుకుంటున్నాడు రాజ‌మౌళి. అస‌లు ఈయ‌న‌కు సినిమాలు త‌ప్ప మ‌రేం తెలియ‌దని అనుకుంటారు కానీ సినిమాల‌తో పాటు అన్నీ తెలుసుకుంటాడు ఈయ‌న‌.

అవ‌స‌రం వ‌చ్చిన‌పుడు అన్నీ బ‌య‌టికి తీస్తుంటాడు ఈ ద‌ర్శ‌క‌ధీరుడు. మాస్ట‌ర్ ప్లాన్ చేసి ఎప్పుడు ఏం చేస్తే లాభం వ‌స్తుందో అదే చేస్తుంటాడు జ‌క్క‌న్న‌. ఇప్పుడు కూడా ఈయ‌న క‌బ‌డ్డి టీంకు ప్ర‌జెంట‌ర్ గా.. బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయాడు రాజ‌మౌళి. ఈ మ‌ధ్య క్రికెట్ కాకుండా బ‌య‌టి క్రీడ‌ల‌కు కూడా బాగా క్రేజ్ పెరిగిపోయింది. ఇందులో భాగంగానే తెలంగాణ క‌బ‌డ్డి ప్రీమియ‌ర్ లీగ్ మొద‌లైంది. ఇందులో నల్గొండ ఈగల్స్ టీమ్ ను త‌న స్నేహితుడు సాయి కొర్ర‌పాటి, అబ్బాయి కార్తికేయ క‌లిసి ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ టీమ్ కు ఎస్ఎస్ రాజమౌళి మెంటర్ గా ఉన్నాడు. ఈ విషయాన్ని ట్విట్ట‌ర్ లో రాజమౌళి స్వయంగా తెలియజేశారు. త్వరలోనే ఈ టోర్న‌మెంట్ మొద‌లు కానుంది. రాజ‌మౌళి చేరిక‌తో ఈ టోర్న‌మెంట్ క్రేజ్ కూడా పెర‌గ‌డం ఖాయం.

ఎన్టీఆర్, చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ తో పాటు త‌న‌లోని బిజినెస్ మెన్ ను కూడా బ‌య‌టికి తీస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆ మ‌ధ్య వాచ్ ల బిజినెస్ కూడా మొద‌లు పెట్టాడు. క‌న్సూమెక్స్ కంపెనీలో స్నేహితుడు శోభు యార్ల‌గ‌డ్డ‌తో క‌లిసి ఇన్వెస్ట్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆర్నెళ్ల కిందే వీళ్ల పార్ట్ న‌ర్ షిప్ మొద‌లైనా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కంపెనీ నుంచి స్మార్ట్ వాచ్ లు బ‌య‌టికి రాలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రాడ‌క్ట్ ఓకే అయిపోయింది. న‌వంబ‌ర్ నుంచి మార్కెట్ లోకి రాబోతున్నాయి. ఛార్జింగ్ అవ‌సరం లేకుండా ఇవి న‌డ‌వ‌నున్నాయి. దానికితోడు మ‌న ప‌ల్స్ రేట్.. రోజుకు ఎంత దూరం న‌డిచాం అనే వివ‌రాలు కూడా చెబుతుంది ఈ వాచ్. అన్నింటికీ మించి మేడిన్ ఇండియా కావ‌డం ఇక్క‌డ విశేషం. ఇలా సినిమాలే ప్ర‌పంచం కాకుండా.. బ‌య‌టి ప్ర‌పంచంలో కూడా త‌న ముద్ర వేయాల‌ని చూస్తున్నాడు రాజ‌మౌళి.

More Related Stories