English   

బిగ్ బాస్ లో కౌశ‌ల్ ఆర్మీ అంత ప‌వ‌ర్ ఫుల్లా..?

Bigg Boss 2 Telugu Ready To Checkmate Kaushal Army
2018-09-04 07:28:22

తొలి సీజ‌న్ తో పోలిస్తే బిగ్ బాస్ రెండో సీజన్ ఇప్ప‌టికీ వెన‌క‌బడే ఉంది. రేటింగ్స్ విష‌యంలో ఒక్క‌సారి కూడా ఎన్టీఆర్ షోను టచ్ చేయ‌లేక‌పోయింది ఈ సీజ‌న్. అయితే పోనుపోను ఈ సీజ‌న్ కూడా ఆస‌క్తిక‌రంగా మారుతుంది. ఇప్పుడు చివ‌రి అంకానికి చేరుకోవ‌డంతో అంతా ఆస‌క్తిగా బిగ్ బాస్ 2ని కూడా చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సీజ‌న్ లో బాగా హైలైట్ అయిన ప్లేయ‌ర్ ఎవ‌రు అంటే మ‌రో మాట లేకుండా కౌశ‌ల్ అని చెబుతారంతా. ఈ యాక్ట‌ర్ బ‌య‌ట ఉన్న‌పుడు సీరియ‌ల్స్ త‌ప్ప మ‌రోటి చేసేవాడే కాదు.. కానీ ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత హీరోగా సినిమా చేసినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈయ‌న‌కు బ‌య‌ట అంత స‌పోర్ట్ ఉంది. కౌశ‌ల్ ఆర్మీ అంటూ ర‌చ్చ చేస్తున్నారు ఈయ‌న ఫ్యాన్స్. అస‌లు ఓ  వ్య‌క్తికి బిగ్ బాస్ తో ఇంత‌గా ప్యాన్ ఫాలోయింగ్ వ‌స్తుందా అనుకుంటున్నారంతా. అయితే ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహ‌కులు కూడా కౌశ‌ల్ ఆర్మీ గురించి ఆలోచ‌న‌లో ప‌డుతున్నారు.

ప్ర‌తీవారం ఆయ‌న నామినేట్ అవుతున్నా కూడా సేవ్ అవుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అవుతాన‌నే న‌మ్మ‌కంతోనే కౌశ‌ల్ కూడా క‌నిపిస్తున్నాడు. ఇదంతా బయ‌టి నుంచి కొంద‌రు కావాల‌నే కౌశ‌ల్ ను సేవ్ చేస్తున్నార‌ని.. ఈ విష‌యంలో బిగ్ బాస్ ని కూడా డామినేట్ చేసే బిగ్గ‌ర్ బాస్ లా కౌశ‌ల్ మారిపోయాడ‌నే వాద‌న కూడా బ‌య‌ట ఉంది. దాంతో షో నిర్వాహ‌కులు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని చూస్తున్నారు. ఇప్ప‌టికే కౌశ‌ల్ కు సాయంగా ఉండే నూత‌న్ ను బ‌య‌టికి పంపించేసారు. ఓ వారం చూసి కౌశ‌ల్ ను కూడా ఇంటి నుంచి బ‌య‌టికి పంపించాల‌ని చూస్తున్నారు. లేదంటే క‌చ్చితంగా ఈ కౌశ‌ల్ ఆర్మీ దెబ్బ‌కు ఆయ‌న ఫైన‌ల్ చేరుకోవ‌డం ఖాయం. అస‌లు నిజంగానే కౌశ‌ల్ ఆర్మీ ఉందా.. ఉంటే అంత ప‌వ‌ర్ ఫుల్ గా ప‌ని చేస్తుందా అనేది అర్థం కావ‌డం లేదెవ్వ‌రికీ..? ఇప్పుడు కానీ కౌశ‌ల్ సేవ్ అయి టైటిల్ కొడితే అది నిజ‌మే అని అంతా క‌న్ఫ‌ర్మ్ చేసుకోవ‌చ్చు.

More Related Stories