English   

ఈ శుక్రవారం లక్ష్మీ కటాక్షం ఉందా..?

Co Kancharapalem Silly Femmows Manu Releasing on September 7th
2018-09-04 02:46:54

ఫ్రైడే వస్తోందంటే చాలు.. థియేటర్స్ అన్నీ కొత్త సినిమా పోస్టర్స్ తో కళకళలాడుతుంటాయి. కానీ ప్రతి పోస్టర్ ఆడియన్స్ ను హ్యాపీగా చేయలేదు. బట్ కొన్నాళ్లుగా టాలీవుడ్ మారింది కదా. అందుకే మాగ్జిమం సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం కనిపిస్తూనే ఉంది. అయితే వచ్చే శుక్రవారం ఐదు సినిమాలు రాబోతున్నాయి. వీటిలో మూడు భిన్నమైన మూవీస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ వీటిలో ఒకటి రొటీన్ కామెడీ కూడా ఉంది. మరి ఈ మొత్తంలో సూపర్ హిట్ అనిపించుకునే సినిమా ఏదీ..?

కేరాఫ్ కంచరపాలెం.. ఈ మధ్య ఏ పెద్ద సెలబ్రిటీ ట్విట్టర్ చూసినాఈ సినిమా గురించి ఏదో ఒక వార్త ఉంటోంది. చాలా రోజుల తర్వాత తెలుగులో ఓ ప్యూర్ కల్ట్ మూవీ వస్తోందనీ.. అది అత్యద్భుతంగా ఉందనీ చెబుతున్నారు. అందరూ కొత్తవారే రూపొందించిన ఈ మూవీ క్లైమాక్స్ ఇప్పటి వరకూ తెలుగు సినిమాల్లో చూడనిది అంటూ ఊదరగొట్టేస్తున్నారు. ఈ సెప్టెంబర్ 7న విడుదల కాబోతోన్న ఈమూవీ ఇప్పటికే ప్రివ్యూస్ తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రాజమౌళి, కీరవాణి, నాని, సుకుమార్ వంటి సెలబ్రిటీస్ ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. మరి ఆ స్థాయిలో ఆకట్టుకున్న ఈ సినిమా ఆడియన్స్ ను కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. అయితే ఖచ్చితంగా ఇది తెలుగులో ఒక బెస్ట్ మూవీగా నిలుస్తుందనేది ప్రతి ఒక్కరూ చెబుతోన్న మాట.

బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా వస్తోన్న సినిమా మను. ఇదో క్రైమ్ థ్రిల్లర్ గా కనిపిస్తోంది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏదో కొత్తగా ప్రయత్నం చేసినట్టు అర్థమౌతోంది. బట్ ఈ సినిమాకు సంబంధించి ఆడియన్స్ లో ఏ బజ్ లేదు. కారణం.. ప్రమోషన్స్ వీక్ గా ఉండటమే. చాందినీ చౌదరి, జాన్ కొట్లాలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాకపోతే ఇది రెగ్యులర్ హీరో, హీరోయిన్, విలన్ టైప్ సినిమాగా మాత్రం కనిపించడం లేదు. మారుతోన్న తెలుగు సినిమాల జాబితాలో నిలిచే కథలా కనిపిస్తోంది. మరి ఈ మను మరింత ప్రమోషన్స్ పెంచుకుంటే.. ఖచ్చితంగా ఇంకాస్త ఎక్కువ ఆడియన్స్ కు చేరువవుతుంది. లేదంటే ప్రయత్నం మంచిదే అయినా ప్రశంసలు రావు.

ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్టేజ్ లో ఉన్న ముగ్గురు కలిసి చేసిన సినిమా సిల్లీ ఫెలోస్. ఆ ముగ్గురూ అల్లరి నరేష్, సునిల్.. దర్శకుడు భీమినేని శ్రీనివాస్. సుడిగాడు తర్వాత భీమినేని, నరేష్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా. కాకపోతే స్పూఫ్ లుండవు. బట్.. ట్రైలర్ లో నవ్వులు పూశాయి. కానీ కథలో కొత్తదనం కనిపించడం లేదు. అందుకేనేమో.. ఈసినిమాలో లాజిక్స్ ఉండవు ఓన్లీ లాఫ్స్ మాత్రమే ఉంటాయి అన్నాడు దర్శకుడు. మరి ఆ నవ్వులు వర్కవుట్ అయితే ఈ సిల్లీ ఫెలోస్ కు హిట్ పడుతుంది.

ఇక ఫైట్ మాస్టర్ గా రెండు దశాబ్ధాలకు పైగా రాణిస్తోన్న విజయ్ మాస్టర్ తనయుడు  రాహుల్ విజయ్ హీరోగా మారాడు. ఈ సినిమా పేరు ఈ మాయ పేరేమిటో. ఇతనికి చాలామంది పెద్ద హీరోల ఆశీర్వాదం ఉంది. కానీ కథలో కంటెంట్ ఉంటేనే హిట్ అవుతుంది. ఇక ఈ సినిమాను విజయ్ మాస్టరే నిర్మించడం విశేషం. ఓ కొత్త దర్శకుడు రూపొందించాడు. కావ్య హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం పెద్ద హైలెట్ కాబోతోందంటున్నారు. మరి ఈ సెప్టెంబర్ 7న వస్తున్న ఈ సినిమా టాలీవుడ్ కు మరో కొత్త హీరోనిస్తుందా లేదా అనేది కూడా డిసైడ్ చేస్తుంది. వీటిలో పాటు ప్రేమకు రెయిన్ చెక్ అనే సినిమా కూడా అదే రోజు విడుదల కాబోతోంది. మరి ఈ మొత్తంలో పెద్దమొత్తంలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సాధించే సినిమా ఏదో కానీ.. ఖచ్చితంగా వీటిలో ఆ మూడు సినిమాలపైనే కాస్త ఆసక్తి అయితే ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఒక్కోసారి మ్యాజిక్స్ జరుగుతాయ్. అప్పుడు అంచనాలు లేని సినిమాలే హైలెట్ అవుతుంటాయ్..

More Related Stories