English   

పూరీ, విజయ్ దేవరకొండ టైటిలా ఇది..?

Puri-Jagannadh
2018-09-04 11:06:00

ఇంట్రెస్టింగ్ టైటిల్స్ తో ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడంలో పూరీ జగన్నాథ్ తెలుగులో ఓ ట్రెండ్ సెట్టర్. నెగెటివ్ సెన్స్ టైటిల్స్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం అతని స్టైల్. అందుకే అతని హీరోలు ఇడియట్స్, దేశముదుర్లు, లోఫర్స్, రోగ్స్ .. ఇలా ఉంటారు. అయినా తొలినాళ్లలో ఈ నెగెటివ్ టైటిల్స్ తోనే సూపర్ హిట్స్ కొట్టాడు పూరీ. ప్రస్తుతం వరుస ఫ్లాపులు.. కాదు డిజాస్టర్స్ తో బాగా వెనక బడ్డ ఈ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్.. రీసెంట్ గా తన కొడుకు ఆకాశ్ పూరీతో చేసిన ‘మెహబూబా’ మరోసారి దర్శకుడుగానే కాక నిర్మాతగానూ లాస్ అయ్యాడు. దీంతో ఇక పూరీలో పస అయిపోయిందనీ.. అతని పని కూడా అయిపోయిందనే కమెంట్స్ గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీంతో పూరీ మళ్లీ బౌన్స్ బ్యాక్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఓ కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు.

లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ రిజిస్టర్ చేయించాడు. కొన్నాళ్ల క్రితం అక్కినేని నాగార్జున ఓ సినిమాలో ‘ఏస్కో నా వాస్కోడగామా’ అనే ఊతపదం చెబుతాడు. పూరీ దాన్నే టైటిల్ గా పెట్టాడు. యస్.. పూరీ కొత్త సినిమా టైటిల్ ‘వాస్కో డ గామా’. గత కొన్నాళ్లుగా  పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ టైటిల్ విజయ్ దేవరకొండ కోసమే అంటున్నారు. కానీ అది నిజం కాదని.. ఈ టైటిల్ తనయుడు ఆకాశ్ పూరీతో చేస్తోన్న సినిమా కోసం రిజిస్టర్ చేయించాడనేవారూ ఉన్నారు. ఏదేమైనా తెలుగులో తనకంటూ ఓ తిరుగులేని ట్రెండ్ క్రియేట్ చేసుకున్న పూరీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని మాత్రం చాలామంది కోరుకుంటున్నారు. 

More Related Stories