English   

స‌మంత అద‌ర‌గొడుతుంది.. అనిరుధ్ సాయంతో..!

U-Turn-song
2018-09-04 13:18:51

చేసింది స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్.. కానీ ఢీ ప్రోగ్రామ్ లో డాన్స్ చేసిన‌ట్లు చేస్తుంది స‌మంత‌. సినిమాను ఎలా చేసాం అన్న‌ది కాదు.. ఎలా ప్ర‌మోట్ చేసాం అనేదే ఇప్పుడు కావాలి. ఈ విష‌యంలో స‌మంత చాలా తెలివైంది. ఎదురుగా భ‌ర్త నాగ‌చైత‌న్య పోటీలో ఉన్నాడ‌ని తెలిసినా కూడా వెన‌క్కి త‌గ్గ‌లేదు ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు ప్ర‌మోష‌న్ లోనూ పిచ్చెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా యు ట‌ర్న్ ప్ర‌మోష‌న‌ల్ వీడియో విడుద‌లైంది. ఇందులో స్యామ్ డాన్స్ మ‌రో స్థాయిలో ఉంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కు డాన్స్ వీడియోతో సంబంధం ఏంటి అనే అనుమానం రావ‌చ్చు కానీ క‌థ‌తో ఎలాంటి సంబంధం లేదు కేవ‌లం ప్ర‌మోష‌న్ కోస‌మే ఈ డాన్స్. పైగా అనిరుధ్ సాయం కూడా తీసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. 

త‌మిళ‌నాట కూడా యు ట‌ర్న్ విడుద‌ల‌వుతుంది.. పైగా అక్క‌డ ఆది లాంటి తెలిసిన న‌టులే ఉన్నారు దాంతో రెండుచోట్లా భారీ ఓపెనింగ్స్ రావాల‌నేది స‌మంత ప్లాన్. అందుకే అనిరుధ్ ను రంగంలోకి తీసుకొచ్చింది. తాను కూడా డాన్సుల‌తో పిచ్చెక్కించింది ఈ ముద్దుగుమ్మ‌. స‌మంత మంచి డాన్స‌ర్ అని తెలుసు కానీ ఇంత‌లా రెచ్చిపోతుంద‌ని మాత్రం ఊహించ‌లేదు. ఇప్పుడు ఇదే చేసి చూపించింది స్యామ్. ఎలాగైనా భ‌ర్త‌ను ఓడించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది ఈ ముద్దుగుమ్మ‌. దీనికోస‌మే అస్త్రాల‌న్నీ వాడుకుంటుంది. అందం త‌ప్ప‌.. అంటే పెళ్లైంది క‌దా ఇప్పుడు అందాల ఆర‌బోత చేస్తే బాగోదు. అందుకే అది త‌ప్ప అన్నీ వాడేస్తుంది ఈ బ్యూటీ. అందులో భాగ‌మే అనిరుధ్ కూడా. మ‌రి ఈ భామ‌కు యు ట‌ర్న్ ఎలాంటి విజ‌యాన్ని తీసుకొస్తుందో సెప్టెంబ‌ర్ 13న తేల‌నుంది. 

More Related Stories