English   

అజ్ఞాత‌వాసికు బ‌లైపోతున్న అర‌వింద స‌మేత‌.. 

Aravinda-Sametha
2018-09-04 14:09:15

ముందు నుంచి అనుకుంటున్న‌దే ఇది. ఓ ద‌ర్శ‌కుడికి ముందు సినిమా భారీ ఫ్లాప్ అయిందంటే క‌చ్చితంగా ఆ ప్ర‌భావం వ‌ద్ద‌న్నా కూడా త‌ర్వాతి సినిమాపై ప‌డుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న న‌టిస్తున్న అర‌వింద స‌మేత షూటింగ్ ప్ర‌స్తుతం హైద్రాబాద్ లోనే జ‌రుగుతుంది. సెప్టెంబ‌ర్ 20 లోపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు త్రివిక్ర‌మ్. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే బిజినెస్ ప‌రంగానూ ఈ చిత్రం కొత్త చ‌రిత్ర సృష్టిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ కెరీర్ లో లేని హైయ్య‌స్ట్ రేట్స్ కు సినిమా వెళ్తుంది. ఓవ‌ర్సీస్ విష‌యంలో మాత్రం ర‌చ్చ మరోలా ఉంది. ఈ చిత్రం ఓవ‌ర్సీస్ రైట్స్ కావాలంటూ ప్ర‌ముఖ ఓవ‌ర్సీస్ డిస్ట్ర‌బ్యూట‌ర్ సంస్థ బ్లూ స్కై అడుగుతున్నారు. దానికి కార‌ణం కూడా ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆల్ టైమ్ డిజాస్ట‌ర్ అజ్ఞాత‌వాసిని అక్క‌డ దాదాపు 25 కోట్ల‌కు కొని.. 18 కోట్ల వ‌ర‌కు న‌ష్ట‌పోయారు. 

దాంతో త్రివిక్ర‌మ్ వాళ్ల‌కు అర‌వింద స‌మేత ఇప్పిస్తాన‌నే మాటిచ్చారు. త‌మ న‌ష్టాలు భ‌ర్తీ అవ్వాలంటే అర‌వింద స‌మేత‌ను ఇవ్వాల్సిందే అంటున్నారు వాళ్లు. కానీ ఇప్పుడు అర‌వింద స‌మేత కాకుండా శైలజారెడ్డి అల్లుడు హ‌క్కుల్ని న‌ష్ట ప‌రిహారంగా బ్లూ స్కైకు ఇచ్చారు. దాంతో వాళ్లు ఈ డీల్ కు నో చెప్పి.. క‌చ్చితంగా అర‌వింద స‌మేత కావాలంటున్నారు. అల్లుడు వ‌చ్చినా రాక‌పోయినా ప‌ర్లేదు కానీ అర‌విందుడు మాత్రం త‌మ‌కే కావాలి అంటున్నారు. అజ్ఞాత‌వాసితో తాము న‌ష్ట‌పోయిన మొత్తాన్ని త్రివిక్ర‌మ్ భ‌రించాల‌ని.. దానికోస‌మైనా క‌చ్చితంగా అర‌వింద స‌మేత హ‌క్కులు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విష‌యంపై త్రివిక్ర‌మ్ కూడా ఆలోచ‌న‌లో ప‌డుతున్నాడు. మొత్తానికి విడుద‌ల‌కు ఇంకా నెల‌న్న‌రే ఉండ‌టంతో ఈ ముస‌లం నుంచి బ‌య‌ట ప‌డాల‌ని చూస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు. మ‌రి చివ‌రి వ‌ర‌కు ఈ వార్ ఎక్క‌డ ముగుస్తుందో చూడాలిక‌..!

More Related Stories