English   

అఖిల్ ను కొనేసిన గీత‌గోవిందం..

Akhil-Akkineni
2018-09-04 15:43:58

అఖిల్ ను గీత‌గోవిందం కొనేయ‌డం ఏంటి.. కొంప‌దీసి అఖిల్ మూడో సినిమాను కానీ గీతాఆర్ట్స్ తీసుకుందా ఏంటి అనుకుంటున్నారా..? అలాంటిదేం జ‌ర‌గ‌లేదు.. పైగా ఈ చిత్రానికి నాగార్జున బ్యాక్ బోన్ గా ఉన్న‌పుడు ఎవ‌రి సాయం అవ‌స‌రం లేదు కూడా. మ‌రి గీత‌గోవిందం ముచ్చ‌టేంటి అనేగా అనుమానం.. ఏం లేదు ఇప్పుడు తెలుగు సినిమాల‌కు ఇక్క‌డ మార్కెట్ తో పాటు ఓవ‌ర్సీస్ కూడా కీల‌క‌మే. అందుకే అక్క‌డ ఎవ‌రికి ఇస్తున్నార‌నే విష‌యం కూడా సినిమా ఫ‌లితంపై ప్ర‌భావం చూపిస్తుంది. అక్క‌డ రెండు మూడు డిస్ట్రిబ్యూష‌న్ సంస్థలు ఇప్పుడు సంచ‌ల‌నాలు రేపుతున్నాయి. అఖిల్ మూడో సినిమాను కూడా అక్క‌డ స‌రిగ‌మ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ తీసుకుంది. 

ఈ చిత్రం ఈ మ‌ధ్యే తీసుకున్న గీత‌గోవిందం సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అక్క‌డ ఈ చిత్రం ఏకంగా 2.4 మిలియ‌న్ వైపు ప‌రుగులు తీస్తుంది. దాంతో ఇప్పుడు అఖిల్ సినిమాపై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. పైగా హ‌లో సినిమాతో అక్క‌డ 1 మిలియ‌న్ అందుకున్నాడు అఖిల్.. మ‌రోసారి ప్రేమ‌క‌థ‌తో వ‌స్తుండ‌టం.. ద‌ర్శ‌కుడు కూడా వెంకీ అట్లూరి కావ‌డంతో ఆస‌క్తి బాగానే ఉంది. పైగా ఇప్పుడు ఓవ‌ర్సీస్ హ‌క్కులు కూడా స‌రైనోడి చేతుల్లోకి వెళ్ల‌డంతో నిశ్చింత‌గా ఉన్నారు అఖిల్ టీం. ఈ చిత్రం డిసెంబ‌ర్ లో విడుద‌ల కానుంది. నిధి అగ‌ర్వాల్ ఇందులో  హీరోయిన్ గా న‌టిస్తుంది. తొలిప్రేమ సినిమాను నిర్మించిన బివిఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి నిర్మాత‌. 

More Related Stories