English   

ర‌కుల్.. రానా.. కుచ్ కుచ్ హోతా హై...!

Rana-Rakul
2018-09-04 10:17:05

రానా ద‌గ్గుపాటి.. ఈ పేరు విన‌గానే విల‌న్ వేషాలు గుర్తొస్తాయేమో కానీ బ‌య‌ట మాత్రం మ‌నోడు రొమాంటిక్ బాయ్. సినిమాల్లో ఆ ఇమేజ్ లేద‌ని ట్రై చేయ‌డం లేదు కానీ ప్రేమ‌క‌థ‌లు కానీ చేసాడంటే అక్కినేని కుటుంబం కూడా స‌రిపోదు రానా రొమాన్స్ ముందు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోల్లా ఎప్పుడూ ఏదో ఓ రిలేష‌న్ లో ఉంటూనే ఉంటాడు రానా ద‌గ్గుపాటి. ఇప్ప‌టికే ఈయ‌న ఖాతాలో త్రిష‌తో పాటు ఇంకా ఇద్ద‌రు ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అప్ప‌ట్లో త్రిష‌తో త‌న రిలేష‌న్ గురించి ఓపెన్ గా ఒప్పుకున్న ఘ‌న చ‌రిత్ర మ‌నోడి సొంతం. అయితే ఇప్పుడు ఈయ‌న ర‌కుల్ తో రిలేష‌న్లో ఉన్నాడ‌నే వార్త‌లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య తెలుగులో ర‌కుల్ పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. అమ్మ‌డు మొత్తం ముంబై టూ చెన్నైలోనే చ‌క్క‌ర్లు కొడుతుంది. 

రానాకు ఇప్పుడు క్యాస్టింగ్ మేనేజ్ మెంట్ కంపెనీ కూడా ఉంది. ముంబై నుంచి ముద్దుగుమ్మ‌ల‌ను ఇక్క‌డికి.. ఇక్క‌డి నుంచి అక్క‌డికి ఆఫ‌ర్లు ఇప్పించే సంస్థ ఇది. దీని ద్వారానే ఇప్పుడు ర‌కుల్ కు త‌న‌కున్న ప‌రిచ‌యాల మేర అవ‌కాశాలు ఇప్పిస్తున్నాడ‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. పైగా ర‌కుల్ ఇప్పుడు న‌టిస్తున్న ఏకైక తెలుగు సినిమా వెంకీ మామా. ఈ చిత్రం సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. అంటే రానా సొంత సంస్థ అన్న‌మాట‌. ఇందులో ఆఫ‌ర్ రావ‌డానికి రానా కార‌ణమ‌నే వాద‌న కూడా ఉంది. ఎలా చూసుకున్నా కూడా ఇప్పుడు రానాతో ర‌కుల్ రిలేష‌న్ హాట్ టాపిక్ గా మారింది. అయితే వీళ్ల రిలేష‌న్ మాత్రం అంత త్వ‌ర‌గా బ‌య‌టికి వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. త్రిష త‌ర‌హాలో కాకుండా బాగా సీక్రెసీ మెయింటేన్ చేస్తున్నాడు రానా. 

More Related Stories