English   

పిచ్చెక్కించిన అమ‌లాపాల్.. బికినీతో అరాచ‌కం..!

Amala-Paul-Aadai
2018-09-04 20:03:21

అమ‌లాపాల్ కు ఏదో అయిపోయింది. లేక‌పోతే మ‌రేంటి.. ఆమె హీరోయిన్ గా ఉన్న‌పుడు కూడా ఇంత గ్లామ‌ర్ షో ఎప్పుడూ చేయ‌లేదు. ఇక విజ‌య్ ను పెళ్లాడిన త‌ర్వాత సినిమాల‌కే దూర‌మైంది. కానీ విడాకుల త‌ర్వాత మాత్రం అమ‌లాపాల్ ను ఆప‌త‌రం కావ‌ట్లేదు ఎవ‌రికీ. అస‌లు ఈ భామ‌కు భ‌ర్తపై ఉన్న కోపమో.. లేదంటే మ‌రే కార‌ణ‌మో ఏమో గానీ ఇష్ట‌మొచ్చిన‌ట్లు రెచ్చిపోతుంది. ఇదివ‌ర‌క‌టి కంటే రెండింత‌లు అందాలు ఆర‌బోస్తుంది. చిట్టిపొట్టి క్యాస్ట్యూమ్స్ లో సెగ‌లు పుట్టిస్తోంది ఈ బ్యూటీ. ఆ మ‌ధ్య త‌న బ‌ర్త్  డే కోసం అమెరికా వెళ్లి..  అక్క‌డ్నుంచే చిట్టి క్యాస్ట్యూమ్స్ లో ఫోటోలు దిగి ర‌చ్చ చేసింది అమ‌లాపాల్.

ఇదే అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఓ సినిమా కోసం బికినికి త‌క్కువ కాని డ్ర‌స్ వేసింది. ప్ర‌స్తుతం ఈమె ఆడ‌య్ సినిమాలో న‌టిస్తుంది. ర‌త్న‌కుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. వైట్ అండ్ వైట్ లో అమ్మ‌డు ఫుల్లుగా అందాలు ఆర‌బోస్తూ రెచ్చిపోయింది. ఇది చూసిన త‌ర్వాత అమ‌లాపాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో అవ‌కాశాల కోసం ఎంత దూరం వెళ్లిపోయిందో అర్థ‌మైపోతుంది. పెళ్లికి ముందు కూడా ఎప్పుడూ ఈ స్థాయిలో అందాలు ఆరబోయ‌లేదు అమ‌లా. కానీ ఇప్పుడు మాత్రం రెచ్చిపోతుంది. ఆ మ‌ధ్య క‌న్న‌డ‌లో సుదీప్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమాలో అమ‌లాపాల్ ఓ రేంజ్ లో అందాలు ఆర‌బోసింది. ఇప్పుడు మ‌రో మ్యాగ‌జైన్ కోసం అందాలు ఆర‌బోసింది అమలాపాల్. దానికితోడు ఈ మ‌ధ్యే ఓ మ‌ళ‌యాలం సినిమా కోసం ఏకంగా సిగ‌రెట్లు కాలుస్తూ.. మందు తాగుతూ ర‌చ్చ చేసింది. 

ఇక ఇప్పుడు కూడా ఇదే చేసింది. ఈ మ‌ధ్యే జిమ్ లో తాను చేస్తోన్న వ‌ర్క‌వుట్స్ కూడా తీసి నెట్ లో పెట్టేసింది ఈ కేర‌ళ‌కుట్టి. అంత‌టితో ఆగ‌కుండా దానికి కొటేష‌న్లు కూడా పెట్టింది అమ‌లాపాల్. ఈ ప్రపంచంలో ప్రతిదీ మన చెంతకు వస్తుంది. కానీ దానిని మనం సొంతం చేసుకోవాలంటే.. అందుకు సరిపడ స్టామినా మనలో ఉన్నప్పుడే అది మనం సొంతం అవుతుందంటూ పోస్ట్ చేసింది. ఈమె పెట్టిన కొటేష‌న్ కు రిప్లైలు కూడా ఘాటుగానే వ‌స్తున్నాయి. మొత్తానికి రీ ఎంట్రీలో ర‌చ్చ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న‌ట్లుంది ఈ ముద్దుగుమ్మ‌. 

More Related Stories