English   

హీరో రామ్ జగడం.. దిల్ రాజు భ‌యం

Cold War Between Hero Ram and Dil Raju's Hello Guru PremaKosame Team
2018-09-04 22:10:46

ఎలాంటి వాళ్ల‌కైనా ఇండ‌స్ట్రీలో గోల్డెన్ పీరియ‌డ్ ఒక‌టి ఉంటుంది. ఆ టైమ్ లో యావ‌రేజ్ సినిమాలు చేసినా కూడా సూప‌ర్ హిట్ అయిపోతుంటాయి. 2017లో దిల్ రాజుకు అదే న‌డిచింది కూడా. ఆ ఏడాది ఆరు సినిమాలు వ‌స్తే అందులో డిజే, ఎంసిఏతో పాటు రాజా ది గ్రేట్ కూడా ఆ టైమ్ కు సుడి బాగుండి బండి లాక్కొచ్చేసాయి. దాంతో తానేం క‌థ ఓకే చేసినా సూప‌ర్ హిట్టే అని ఫిక్స్ అయిపోయాడు దిల్ రాజు. అయితే 2018లో ఆ మబ్బులు త్వ‌ర‌గానే విడిపోయాయి. ముందు ల‌వ‌ర్ తో.. ఆ త‌ర్వాత భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన శ్రీ‌నివాస క‌ళ్యాణంతో రెండు వ‌ర‌స షాకులు తిన్నాడు దిల్ రాజు. దాంతో ఇప్పుడు హ‌లో గురు ప్రేమ‌కోస‌మేతో ఎలాగైన హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు ఈ నిర్మాత‌. అయితే ఈ చిత్ర హీరో రామ్.. సినిమా యూనిట్ కు మ‌ధ్య ఏదో వార్ జ‌రుగుతుంద‌ని అంత‌ర్గ‌త వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

ఇప్ప‌టికే ఈ చిత్ర కెమెరామెన్ తో రామ్ కు సీరియ‌స్ గా గొడ‌వైంద‌ని.. ఒక‌ట్రెండు సార్లు షూటింగ్ నుంచి కూడా వెళ్లిపోతే రాజుగారే ద‌గ్గ‌రుండి ఇష్యూ సెటిల్ చేసార‌నే వాద‌న ఉంది. ఇలాంటి టైమ్ లో సినిమా ఔట్ పుట్ పై ఇది ఎక్క‌డ ప్ర‌భావం చూపిస్తుందో అని టెన్ష‌న్ ప‌డుతున్నాడు దిల్ రాజు. ఇదిలా ఉంటే ఈ చిత్ర రీ షూట్స్ కూడా మొద‌ల‌య్యాయ‌ని తెలుస్తుంది. ఈ సినిమా ఔట్ పుట్ చూసిన త‌ర్వాత రాజుగారి హ్యాపీనెస్ పోయింద‌ని.. అందుకే అక్క‌డ‌క్క‌డా మ‌ళ్లీ రీ షూట్ చేయాల్సిందిగా నిర్మాతే కోర‌డంతో చేసేదేం లేక ద‌ర్శ‌కుడు మ‌ళ్లీ ప‌ని మొద‌లుపెట్టిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. అక్టోబ‌ర్ 18న ఈ చిత్రం విడుద‌ల కానుంది. అయితే ఇప్పుడు తీరు చూస్తుంటే నిజంగానే ఆ టైమ్ కు వ‌స్తుందా అనేది మాత్రం అనుమానంగానే మారింది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ప్ర‌ణీత ఇందులో రామ్ తో జోడీ క‌ట్టారు. 

More Related Stories