English   

మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్.. ప‌రువు తీస్తున్నారు.

Movie Artist Association Divided into Two Groups
2018-09-05 00:00:58


ఎవ‌రైనా త‌ప్పు చేస్తుంటే ఏంట‌మ్మా ఇది తెలివి లేదా అంటారు. కానీ ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్ (మా) త‌ప్పు చేస్తుంటే ఏమ‌నాలి..? అస‌లు ఇండ‌స్ట్రీలో ఏదైనా త‌ప్పు జ‌రిగితే వెళ్లి మా అసొషియేష‌న్ లో ఫిర్యాదు చేస్తారు. కానీ ఇప్పుడు ఆ మా త‌ప్పు చేసింద‌ని ర‌చ్చ చేస్తున్నారు కొంద‌రు. ఒక‌రిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకుంటూ వాళ్ల ప‌రువు వాళ్లే తీసుకుంటున్నారు. అస‌లు ఇండ‌స్ట్రీలో గ్రూపులు ఉన్నాయ‌ని.. ఎవ‌రికి వాళ్లు స‌ప‌రేట్ గా గ్రూపులు ఫార్మ్ చేసుకుని ఉన్నార‌ని చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కాక‌పోతే దాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసే వాళ్లే లేరు. కాక‌పోతే వాళ్ల‌కు కావాల్సిన ప‌నులు వాళ్లు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ఫ‌ర్ ది ఇండ‌స్ట్రీ.. బై ది ఇండ‌స్ట్రీ.. అంటూ గొప్ప‌ల‌కు పోయే మా అసోషియేష‌న్ కూడా ఇప్పుడు రెండు వ‌ర్గాలుగా చీలిపోయింది.

అది కూడా కులాల వారిగా చీలింద‌నే వార్త‌లే ఇప్పుడు ఇండ‌స్ట్రీని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. క‌మ్మ కాపు వ‌ర్గాల నుంచి చాలా కాలంగా చీల‌క‌లు వ‌స్తూ ఉన్నాయ‌నే వార్త‌లు ఎప్ప‌ట్నుంచో వినిపిస్తున్నవే. మోహ‌న్ బాబు వ‌ర్గం ఓ సైడ్ ఉంటే.. చిరంజీవి వ‌ర్గం మ‌రో వైపు ఉంటుంద‌ని.. మ‌ధ్య మ‌ధ్య‌లో మ‌రికొంద‌రు కూడా ఉన్నార‌ని ఎప్ప‌ట్నుంచో వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వాళ్ల పేర్లు బ‌య‌టికి రాకుండా సింపుల్ గా పైకి మాత్రం న‌రేష్, శివాజీరాజాలు క‌నిపిస్తున్నారు. పైగా అమెరికా ఇష్యూను ఇప్పుడు తెర‌పైకి తీసుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్ సిల్వర్ జూబ్లీ అయిందని ఆ మ‌ధ్య యుఎస్ వెళ్లి షో చేసుకుని వ‌చ్చారు. అయితే ఇప్పుడు ఆ డ‌బ్బులు మిస్ యూజ్ చేసారంటూ న‌రేష్ ఆరోపిస్తున్నారు.

ఈ ఇష్యూ ఇంత పెద్ద‌గా జ‌రుగుతున్నా కూడా ఇండ‌స్ట్రీ నుంచి ఒక్క పెద్ద‌మ‌నిషి కూడా ఇందులో చొర‌వ తీసుకోవ‌డం లేదు. ముఖ్యంగా చిరంజీవి కూడా ఈ విష‌యంలోనే ఉన్నాడు. అయితే ఆయ‌న‌కు ఇది సంబంధం లేని విష‌యం. ర‌మ్మంటే వ‌చ్చాడు అంతే. అయితే ఆయ‌న పేరు చెప్పే కొంద‌రు డ‌బ్బులు తిన్నారంటున్నాడు న‌రేష్. ఓ వైపు క‌న్న‌డ‌.. మ‌రోవైపు త‌మిళ‌నాడులో న‌డిగ‌ర్ సంఘం వాళ్ల‌కంటూ సొంత బిల్డింగ్ క‌ట్టేసారు. కానీ తెలుగు ఇండ‌స్ట్రీ మాత్రం 20 ఏళ్ళుగా క‌డుతూనే ఉన్నాం అంటున్నారు కానీ క‌ట్ట‌డం లేదు. అస‌లు క‌డ‌తారో లేదో కూడా తెలియ‌దు. క‌డితే మ‌రో టాపిక్ ఉండ‌దు క‌దా..!

అస‌లు మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్ (మా) లో చీలిక కూడా కొంద‌రు కావాల‌నే చేస్తున్నాని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది కుల చిచ్చుగా కూడా మారుతుంద‌నే వాదన కూడా బ‌య‌ట జ‌రుగుతుంది. క‌మ్మ కాపు కులాల మ‌ధ్య చీల‌క‌ల నుంచి ఇండ‌స్ట్రీ కూడా విచ్ఛిన్నంగా మారిపోయింద‌ని తెలుస్తుంది. ఈ రోజు ఇంత పెద్ద స‌మ‌స్య ఎదురుగా ఉన్నా కూడా ఎవ‌రికి వాళ్లు ఇది త‌మ వ‌ర్గానికి కాద‌న్న‌ట్లుగా చేతులు క‌ట్టుకుని కూర్చున్నారు. దాంతో చిలికి చిలికి గాలివాన అవుతుంది ఈ ఇష్యూ. తమిళ్ లో సీనియర్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్, యంగ్ హీరోలు విశాల్, కార్తీ లాగ మన స్టార్ హీరోలు కానీ, కుర్ర హీరోలు కానీ మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్ (మా) కోసం ఎందుకు    పాటుపడరో అర్ధం కాదు. మూవీ ఆర్టిస్ట్ అసోషియేష‌న్ అంటే ఒకే కుటుంబం అని అంటారు కానీ ఆచరణలో అది చూపించరు. ఆ మ‌ధ్య శ్రీ‌రెడ్డి.. క‌త్తిమ‌హేశ్ అప్పుడు కూడా ఎవ‌రికి వాళ్లు సైలెంట్ గానే ఉన్నారు. మొత్తానికి ఇండ‌స్ట్రీ అంతా ఒకేతాటిపై ఉంటే ఇలాంటి స‌మ‌స్య‌లే రావ‌ని కొంద‌రు అంటుంటే.. కావాల‌నే కొంద‌రు ఇలా విడ‌గొడుతున్నార‌ని అంటున్నారు. మ‌రి ఈ ఇష్యూ ఎక్క‌డివ‌ర‌కు వెళ్తుందో చూడాలి..

More Related Stories