English   

నాగార్జున, నాని(దేవదాస్) లకు ఆయనే చీఫ్ గెస్ట్

Nagarjuna Nani Combination Movie Devadas Audio Launch Confirmed
2018-09-05 07:25:53

ఇన్నాళ్లూ ఏం చేసినా క‌లిసే చేసారు దేవ‌దాస్. అది ఎంజాయ్ చేసినా.. అల్ల‌రి చేసినా.. వినోదాన్ని విషాదాన్ని క‌లిసే పంచుకున్నారు. విడుద‌ల వ‌ర‌కు కూడా ఇదే కంటిన్యూ చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా. ప్ర‌తీసారి ఇద్ద‌రి లుక్స్ క‌లిపి విడుద‌ల చేస్తున్నారు. నాగార్జున బ‌ర్త్ డే లుక్ త‌ర్వాత కూడా ప్ర‌త్యేకంగా ఓ పాట విడుద‌ల చేసారు.. అందులో నాని కూడా ఉన్నాడు. ఈ సినిమా కోసం అటు నాని ఫ్యాన్స్.. ఇటు నాగ్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఇందులో దేవ డాన్ అయితే.. దాస్ డాక్ట‌ర్. ఈ ఇద్ద‌రూ క‌లిసి చేసే ఫ‌న్ సినిమా. శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ క‌మ‌ర్షియ‌ల్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిస్తున్నాడు.

ఇక ఈ చిత్ర ఆడియో వేడుక సెప్టెంబ‌ర్ 19న జ‌ర‌గ‌బోతుంది. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుండ‌టంతో వారం రోజుల ముందు ఈ ఆడియో ప్ల‌స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాడు నిర్మాత అశ్వినీద‌త్. దీనికి మహేష్ బాబు ఛీఫ్ గెస్ట్ గా వ‌చ్చే అవ‌కాశం ఉంది. మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ మ‌ధ్య ప్రేక్ష‌కులు పూర్తిగా మ‌రిచిపోయిన నేప‌థ్యంలో మ‌ళ్లీ త‌న‌ని గుర్తు పెట్టుకోండంటున్నాడు మ‌ణిశ‌ర్మ‌. ఈ చిత్రంలో ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక‌.. ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

More Related Stories