English   

ఆ ప్లాప్ డైరెక్టర్ ఇప్పుడు అసిస్టెంట్ గా మారాడు

Few Tollywood Directors Giving Chance to Director Meher Ramesh
2018-09-05 08:35:51

ఇండ‌స్ట్రీలో కొంద‌రు ద‌ర్శ‌కుల‌కు ఏం చేసినా కాలం క‌లిసిరాదు. అలాంటి వాళ్ళ‌లో మెహ‌ర్ ర‌మేష్ అంద‌రికంటే ముందుంటాడు. ఈయ‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాలు మ‌రే ద‌ర్శ‌కుడికి రాలేదు. ఒక్క‌టంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ వ‌చ్చిన నాలుగు సినిమాలు నాలుగు డిజాస్ట‌ర్లుగా మ‌లిచాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు ఈ పేరు వింటేనే నిర్మాత‌లు హీరోలు వ‌ణికిపోతున్నారు. కంత్రి.. బిల్లా.. శ‌క్తి.. షాడో.. ఇలా ఒక‌దాన్ని మించి మ‌రో సినిమాలు ఇచ్చాడు మెహ‌ర్ ర‌మేష్. క‌న్న‌డ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఇచ్చిన ఈ ద‌ర్శ‌కుడికి తెలుగు ఇండ‌స్ట్రీ మాత్రం క‌లిసిరాలేదు. ఇక్క‌డ చేసిన సినిమాలే ఆయ‌న‌కు శాపంగా మారాయి. షాడో వ‌చ్చి ఐదేళ్లైనా ఇప్ప‌టికీ మ‌రో ఆఫ‌ర్ రాలేదు. దాంతో కొన్నాళ్లుగా ప్ర‌పంచానికి దూరంగా ఎక్క‌డో ఉన్నాడు.. క‌నీసం ప‌బ్లిక్ ఫంక్ష‌న్ ల‌కు కూడా రావ‌ట్లేదు. ఈయ‌న ఇప్పుడు మెగా కుటుంబంతోనే ఉంటున్నాడు. వాళ్ల‌కు బంధువు కావ‌డంతో అదే ఫ్యామిలీతో క‌లిసిపోయాడు మెహ‌ర్. ఆ మ‌ధ్య ప‌వ‌న్ తో సినిమా కోసం ప్ర‌య‌త్నించినా తెలివిగా త‌ప్పించుకున్నాడు ప‌వ‌ర్ స్టార్.

ఆయ‌న బ‌య‌ట క‌నిపించి కూడా కొన్ని నెల‌ల‌వుతోంది.. ఇంకా మాట్లాడి ఏళ్ల‌వుతోంది.. ఓ ర‌కంగా ప్రేక్ష‌కుల‌తో పాటు ఇండ‌స్ట్రీ కూడా మెహ‌ర్ ర‌మేష్ ను మ‌రిచిపోయింది. షాడో వ‌చ్చి నాలుగేళ్లు గ‌డిచినా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ సినిమా అవ‌కాశం అందుకోలేక‌పోయాడు ఈ ద‌ర్శ‌కుడు.  ఇప్పుడు ఈయ‌న ఏం చేస్తున్నాడు..? ఎక్క‌డ ఉన్నాడు..? ఎవ‌రి సినిమాల‌కు ప‌ని చేస్తున్నాడు..? ఇవ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌లే. కానీ మెహ‌ర్ ఎవ‌రి సినిమాకు ప‌ని చేస్తున్నాడో తెలిస్తే షాక్ అయిపోతారు. ఈయ‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. అంతేకాదు.. కొంద‌రు ద‌ర్శ‌కులు మెహ‌ర్ పై ఉన్న న‌మ్మ‌కంతో ఆయ‌న‌కే కొన్ని యాక్ష‌న్ సీక్వెన్సులు తెర‌కెక్కించాలంటూ బాధ్య‌త అప్ప‌చెబుతున్నారు. ఆ మ‌ధ్య పైసావ‌సూల్ లో కొన్ని సీన్స్ తెర‌కెక్కించింది ఈయ‌నే. గ‌తంలో పూరీ తెర‌కెక్కించిన ఆంధ్రావాలా.. గుణ‌శేఖ‌ర్ ఒక్క‌డు సినిమాల‌ని క‌న్న‌డ‌లో రీమేక్ చేసి సూప‌ర్ హిట్ కొట్టాడు మెహ‌ర్ ర‌మేష్. పైగా స్టైలిష్ డైరెక్ట‌ర్ అని మనోడికి పేరుంది. ఇంకేం కావాలి..? అందుకే కొంద‌రు ద‌ర్శ‌కులు ఈయ‌న్ని త‌మ అసిస్టెంట్ గా ఫిక్స్ చేసుకున్నారు.

More Related Stories