English   

రాజా కొడుకు రాజా కాలేడంటున్న హృతిక్.. 

Hrithik-Roshan-Super-30
2018-09-05 12:15:33

హృతిక్ రోష‌న్ కు ఇప్పుడు అర్జంట్ గా ఓ హిట్ కావాలి. ఈయ‌న‌కు క్రేజ్ ఉంది కానీ చెప్పుకోడానికి కొన్నేళ్లుగా ఒక్క హిట్ కూడా లేదు. ఈయ‌న ఏ సినిమా చేసినా కూడా ఫ్లాప్ అనే మాట త‌ప్ప మ‌రోటి వినిపించ‌డం లేదు. దాంతో ఈ సారి కాస్త జాగ్ర‌త్త‌గా ఆలోచించి.. ప‌క్కా క‌థ ఉన్న సినిమాతోనే వ‌స్తున్నాడు. అస‌లే ఇప్పుడు బాలీవుడ్లో బయోపిక్ ల‌కు బాగా డిమాండ్ న‌డుస్తుంది. అందుకే అలాంటి బ‌యోపిక్ తో వ‌స్తున్నాడు హృతిక్ రోష‌న్. ఈ హీరో ప్ర‌స్తుతం సూప‌ర్ 30 సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం ప్ర‌ముఖ విద్యావేత్త ఆనంద్ కుమార్ బ‌యోపిక్. ప్రతీ ఏడాది ఐఐటి, జేఈఈకు 30 మంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ను ఎంపిక చేసి వాళ్ల‌కు ఫ్రీగా చ‌దువు చెప్పిస్తాడు ఆనంద్ కుమార్. 

అలా ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాకు ఎంద‌రో కుర్ర మేధావుల‌ను అందించాడు ఈయ‌న‌. ఇలాంటి గొప్ప వ్య‌క్తి జీవితం ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఇందులో హృతిక్ రోష‌న్ టైటిల్ రోల్ చేస్తున్నాడు. క్వీన్ సినిమా తెర‌కెక్కించిన వికాస్ భెల్ ద‌ర్శ‌కుడు. తాజాగా ఈ చిత్ర ప్రీ లుక్ విడుద‌లైంది. రాజా కా బేటా రాజా న‌హీ హోతా అంటూ వ‌స్తున్నాడు హృతిక్. ఈ పాత్ర కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు హృతిక్. అయితే లుక్ మాత్రం మాస్ సినిమా మాదిరే ఉంది. మ‌రి దీన్ని వికాస్ భెల్ ఎలా తెర‌కెక్కిస్తున్నాడో..? 2019 జ‌న‌వ‌రి 26న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి హృతిక్ కోరుకుంటున్న విజ‌యం ఈ సినిమాతోనైనా వ‌స్తుందా..? 

More Related Stories