English   

రవితేజ మ‌రో ఫ్లాప్ కు ప్రిపేర్ అవుతున్నాడా..?

Ravi-Teja
2018-09-05 15:16:06

మాస్ మ‌హ‌రాజ్ రవితేజ సినిమాలంటే ఒక‌ప్పుడు మినిమం గ్యారెంటీ. కానీ ఇప్పుడు మాగ్జిమం బోరింగ్. ఇదంతా త‌న స్వ‌యంక్రుతాప‌రాధ‌మే. మూస క‌థ‌ల‌తో రొటీన్ రోరింగ్స్ తో ప్ర‌తిసారీ వ‌ర్క‌వుట్ అవుతుంద‌నుకున్నాడు. అందుకే కొంద‌రు కొత్త ద‌ర్శ‌కులు చెప్పిన మంచిక‌థ‌లు కూడా రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు ప్ర‌తిఫ‌లం అనుభ‌విస్తున్నాడు. ఈ ఐదారేళ్ల కాలంలో ర‌వితేజ‌కు వ‌చ్చిన హిట్స్, బ‌లుపు, రాజా ది గ్రేట్ మాత్ర‌మే. పోయినవి మాత్రం ఐదారుకు పైనే ఉంటాయి. మ‌రి ఇలాంట‌ప్పుడు ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది పోయి.. రాజా ది గ్రేట్ త‌ర్వాత ట‌చ్ చేసి చూడు అంటూ మ‌రోసారి ప‌ర‌మ రొటీన్ క‌థ‌తో వ‌చ్చాడు. ఇదీ పోయింది. ఇదే టైమ్ లో మ‌న‌కు కొత్త క‌థ‌లు బాగా వ‌ర్క‌వుట్ అవుతున్నాయి. ఆ వైపుకు ప్ర‌య‌త్నం చేయ‌కుండా మ‌రోసారి శ్రీనువైట్ల డైరెక్ష‌న్ లో సినిమాకు క‌మిట్ అయ్యాడు. అటు శ్రీను కూడా వ‌రుస డిజాస్ట‌ర్స్ తో ఉన్నాడు. అయినా అత‌నిపై న‌మ్మ‌కంతో ఏకంగా త్రిపాత్రాభిన‌యం చేస్తూ కొత్త సినిమా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీకి కమిట్ అయ్యాడు.

 కానీ లేటెస్ట్ గా వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ చూసిన త‌ర్వాత ఇది కూడా రొటీన్ ఫ్లిక్ అనేది అర్థ‌మైంది. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ఫారిన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. అయితే అక్క‌డ శ్రీను వైట్ల ప‌నిత‌నం చూసిన త‌ర్వాత ర‌వితేజ చాలా డిజ‌ప్పాయింట్ అయ్యాడ‌ట‌. ఏ మాత్రం కొత్త‌ద‌నం లేని క‌థ‌లోనే మ‌ళ్లీ త‌ను యాక్ట్ చేస్తున్న‌ట్టు మ‌నోడికి తెలిసివ‌చ్చింద‌ట‌. దీంతోకాస్త కొత్త కంటెంట్ తో రావాల‌ని శ్రీనుకు ర‌వితేజ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అయితే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ మాత్ర‌మే కాదు.. అదే రోజు టీజ‌ర్ కూడా విడుద‌ల చేయాల‌నుకున్నార‌ట‌. కానీ శ్రీను క‌ట్ చేయించిన టీజ‌ర్ మ‌రీ పూర్ గా ఉండ‌టంతో ర‌వితేజ వ‌ద్ద‌న్నాడంటున్నారు. త‌ర్వాత రీసెంట్ గా ట్రైల‌ర్ కూడా క‌ట్ చేయించాడ‌ట శ్రీను. కానీ ఇది కూడా ఈ మాస్ రాజాకు న‌చ్చ‌లేందని టాక్. మొత్తంగా త‌ను ఏదో ఊహించుకుని అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీగా న‌టించేందుకు ఒప్పుకున్నా.. అటు శ్రీను వైట్ల నుంచి ఏ కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో మ‌రో ఫ్లాప్ గ్యారెంటీ అని మెంట‌ల్ గా ఫిక్స్ అయ్యాడ‌ట ర‌వితేజ‌. 

More Related Stories