English   

స‌మంత అకౌంట్ లో మ‌రో రికార్డ్

Samantha-Uturn
2018-09-05 18:08:11

స‌మంత‌.. త‌న‌కు ఇంకో పేరుంది.. అదే హిట్ మెషీన్.. య‌స్ సమంత ట‌చ్ చేసిందంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ బ‌లంగానే ప‌డిపోయింది. పెళ్లి త‌ర్వాత కూడా ఆ ఇమేజ్ మార‌లేదు స‌రిక‌దా.. ఈ యేడాది ఇప్ప‌టికే హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది. అలాగే ఈ నెల 13ఏకంగా ఒకే రోజు రెండు సినిమాల‌తో రాబోతోంది. వీటిలో క‌న్న‌డ రీమేక్ యూ ట‌ర్న్ ఒక‌టి. ఈ మూవీ తెలుగుతో పాటు త‌మిళ్ లో కూడా విడుద‌ల కాబోతోంది. అటు త‌మిళ్ లో శివకార్తికేయ‌న్ స‌ర‌స‌న న‌టించిన సీమ‌రాజా కూడా అదే రోజున త‌మిళ‌నాడులో విడుద‌ల కాబోతోంది. ఈ రెండు సినిమాల రిజ‌ల్ట్స్ పై పూర్తి ధీమాగా ఉన్న స‌మంత అకౌంట్ లో లేటెస్ట్ గా ఓ కొత్త రికార్డ్ వ‌చ్చి చేరింది. 

సోష‌ల్ మీడియాలో స‌మంత ఎంత యాక్టివ్ గా ఉంటుందో త‌న‌ను ఫాలో అయ్యేవారంద‌రికీ తెలుసు. త‌న ప్ర‌తి విష‌యాన్నీ సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా త‌ను ట్విట్ట‌ర్ లో మ‌రింత యాక్టివ్ గా ఉంటుంది. ఇది కూడా త‌న‌కు అభిమానులు మ‌రింత పెర‌గ‌డానికి కార‌ణాల్లో ఒక‌టి. పైగా బోల్డ్ గా మాట్లాడేస్తుంది. ఎక్స్ ట్రాలు చేసేవారికీ అలాగే త‌న‌దైన స్టైల్లో ఆన్స‌ర్స్ ఇస్తుంది. మొత్తంగా ఈ సోష‌ల్ మీడియాలోనే శామ్ ఓకొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. య‌స్.. ట్విట్ట‌ర్ లో స‌మంత‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య సెవెన్ మిలియ‌న్ కుచేరుకుంది. ఈ విష‌యాన్ని కూడా త‌నే స్వ‌యంగా ట్వీట్ చేసింది. ఆ ఆనందాన్ని తెలిపేలా ఓ అంద‌మైన ఫోటో కూడా పోస్ట్ చేసింది. మొత్తంగా స‌మంత‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 70ల‌క్ష‌ల‌కు చేరింద‌న్న‌మాట‌. తెలుగులో మ‌రే న‌టుడుకీ, న‌టికీ ట్విట్ట‌ర్ లో  ఇంత‌మంది ఫాలోవ‌ర్స్ లేక‌పోవ‌డం విశేషం.ఏదేమైన స‌మంత న‌వ‌త‌రం మ‌హిళ‌కు అచ్చ‌మైన ఎగ్జాంపుల్. 

More Related Stories