English   

బ్ర‌హ్మానందం త‌న‌యుడు ఈ సారైనా గ‌ట్టెక్కేనా

Raja-Goutham
2018-09-05 19:11:36

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎవ‌రికీ సాధ్యం కానంత ఎక్కువ కాలం క‌మెడియ‌న్ గా ప‌రిశ్ర‌మ‌లో తిరుగులేని స్థానం సంపాదించుకున్నాడు బ్ర‌హ్మానందం. ఏజ్ బార్ అయిన త‌ర్వాత ఎన్నో సినిమాలునిల‌బెట్టిన క‌మెడియ‌న్ బ్ర‌హ్మీ. గ‌త కొంత కాలంగా స‌రైన ఆఫ‌ర్స్ లేక‌పోయినా ఓ క‌మెడియ‌న్ గా అత‌ని స్థానాన్ని ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ కాద‌న‌లేని స్థాయిలో ఉంది. అయితే అత‌ని త‌న‌యుడు గౌత‌మ్ ను హీరోగా ప‌రిచ‌యం చేశాడు బ్ర‌హ్మానందం. ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు సినిమాతో. ఈ చిత్రానికి రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ కూడా చేశాడు. ఈ మూవీ యావ‌రేజ్ గా నిలిచినా.. గౌత‌మ్ లో టాలెంట్ లేక‌పోవ‌డంతో ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాడు. త‌ర్వాత మ‌రికొన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఏవీ స‌క్సెస్ కాలేదు. ఈ నేప‌థ్యంలోవ‌చ్చే శుక్ర‌వారం మ‌నుగా వ‌స్తున్నాడు.

రొమాంటిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా వ‌స్తోన్న మ‌ను లో రాజా గౌత‌మ్ పాత్ర కొత్త‌గా ఉంది. ఈ ట్రైల‌ర్ కూడా చాలామందిని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. 115మంది చేసిన క్రౌడ్ ఫండింగ్ చేసిన ఈ సినిమాపై గౌత‌మ్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఇదైనా త‌న‌కు బ్రేక్ ఇస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితిలో గౌత‌మ్ కు హీరోగా పెద్దగా క్రేజ్ వ‌చ్చే అవ‌కాశ‌మే లేదు. కాక‌పోతే ఇలాంటి సినిమాలతో కాస్త లైమ్ లైట్ లో ఉంటాడు. పైగా ఇప్పుడు ప‌రిశ్ర‌మ‌కు కొత్త నీరువ‌స్తోంది. దీంతో వారి ప్ర‌యోగాల్లో వారు చెప్పిన‌ట్టు న‌టిస్తే చాలు.. గౌత‌మ్ కొంత‌కాలం న‌టుడుగా స‌స్టెయిన్ కాగ‌ల‌డు. ఇక శుక్ర‌వారం మ‌నుతో పాటు చాలా పోటీ ఉంది. మ‌రి ఈ పోటీలోఅత‌ను ఎలా నిలుస్తాడు అనేది ప‌క్క‌న బెడితే కాస్త మంచి న‌ట‌న చూపించ‌గ‌లిగితే మ‌రికొన్ని సినిమాల్లో ఛాయిస్ అవుతాడు.

More Related Stories