English   

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రో తెలిసిపోయింది..?

Simbu-Megha-Akash
2018-09-05 19:23:57

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరుకు ఉన్న వైబ్రేష‌న్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ వైబ్స్ తోనే యావ‌రేజ్ సినిమాలు చేసినా నిర్మాత‌లు లాస్ కాకుండా చూస్తుంటాడు. అత‌ని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఒక‌టి అత్తారింటికి దారేదీ ఒక‌టి. ఈ మూవీలో ఆయ‌న న‌టుడుగానూ తొలిసారి క‌న్నీళ్లు పెట్టించాడు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ సినిమా ఇప్పుడు త‌మిళ్ లో రీమేక్ కాబోతోంది. అక్క‌డి భారీ నిర్మాణ సంస్థ అయినా లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ మూవీని రీమేక్ రైట్స్ తీసుకుంది. అయితే ఇది చాలా రోజుల క్రిత‌మే జ‌రిగింది. దీంతో ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారా అన్న ఆస‌క్తి అటు త‌మిళ్ తో పాటు ఇటు తెలుగులోనూ ఉంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌ర్ స్టార్ పాత్ర ఎవ‌రు చేస్తున్నారో తెలిసిపోయింది.

ప‌వ‌ర్ స్టార్ రేంజ్ కాక‌పోయినా దాదాపు అలాగే పిలిపించుకునే స్టార్ శింబు. కొన్నాళ్లుగా వివాదాల్లో వేళ్లు పెడుతూ సినిమాల‌పై పెద్ద‌గా కాన్ సెంట్రేట్ చేయ‌కుండా వ‌రుస ఫ్లాపులు చూస్తున్నాడు శింబు. అయితే కొన్నాళ్ల క్రితం ఇక వివాదాల వైపు వెళ్ల‌న‌ని బుద్ధిగా సినిమాలు చేసుకుంటా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ త‌ర్వాతే త‌న‌కు మ‌ణిర‌త్నం న‌వాబ్ సినిమాలో పాత్ర ద‌క్క‌డం విశేషం. అయితే క్యారెక్ట‌ర్ఎలాంటిదైనా మ‌నోడు టాలెంటెడ్ యాక్ట‌ర్ కూడా. ఈ నేప‌థ్యంలో అత్తారింటికి దారేదీ రీమేక్ లో శింబును హీరోగా తీసుకున్నారు. కంటెంట్ యూనివ‌ర్సల్ కాబ‌ట్టి ఇది అక్క‌డా వ‌ర్క‌వుట్ అవుతుంది. అందుకే వెంట‌నే య‌స్ చెప్పాడు శింబు. 

ఇక ఈ సినిమాలో అత్త‌గా న‌దియా పాత్ర‌లో త‌మిళ్ లో ఖ‌ష్బూ న‌టించ‌బోతుండ‌టం విశేషం. ఇక హీరోయిన్ గా తెలుగులో వెల‌గాలనుకున్న డ‌స్కీ బ్యూటీ మేఘా ఆకాశ్ ను స‌మంత పాత్ర‌లో తీసుకున్నారు. ఇత‌ర పాత్ర‌ల ఎంపిక కూడా వేగంగా జ‌రుగుతోంది. మ‌రోవైపు ఈ నెల‌లోనే షూటింగ్ కూడా మొద‌లుపెట్టాల‌నుకుంటున్నార‌ట‌. మ‌రో విశేషం ఏంటంటే వీళ్లు కూడా మాగ్జిమం షూటింగ్ హైద‌రాబాద్ లోనే చేయాల‌నుకుంటున్నార‌ట‌. చాలా వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి వ‌చ్చే సంక్రాంతి బ‌రిలో నిల‌వాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఈ త‌మిళ్ అత్తారిల్లుకు ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుందో చూడాలి. 

More Related Stories