English   

తెలుగు తెర‌కు మ‌రో స‌రిత‌

Praneetha-Patnaik
2018-09-05 19:40:07

స‌రిత‌.. ఎర్లీ ఎయిటీస్ లో ఈ పేరుతో వ‌చ్చిన అందాల గాలికి ఉక్కిరిబిక్కిర‌య్యారు నాటి కుర్రాళ్లు. మ‌రో చ‌రిత్రతో స‌రిత క్రియేట్ చేసిన అందాల ప్ర‌భంజ‌నం ఆనాడు సెన్షేష‌న్ గా మారింది. ఆ త‌ర్వాత స‌రిత ద‌క్షిణాది వారికి ఓవ‌ర్ నైట్ హాట్ ఫేవ‌రెట్ గా మారింది. కొన్నాళ్ల‌కు త‌నలో అద్భుత‌మైన న‌టి కూడా ఉంద‌ని ఎన్నో సినిమాల‌తో ప్రూవ్ చేసుకుంది స‌రిత‌. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు గ్యాప్ఇచ్చింది. క‌ట్ చేస్తే ఓ ద‌శాబ్దం క్రితం మ‌హేష్ బాబు అర్జున్ సినిమాలో లేడీ విల‌న్ గా రీ ఎంట్రీ ఇచ్చిన స‌రిత‌ను చూసి షాక్అయ్యారు. అంత‌లా గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయింది స‌రిత‌. అయినా త‌నంటే మ‌నాళ్ల‌కు ఎప్పుడూ స్పెష‌ల్ క్రేజ్ ఉంది. అలాంటి స‌రిత ఇప్పుడు తెలుగు తెర‌పై మ‌ళ్లీ హీరోయిన్ గా దూసుకురాబోతోంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. అది కూడా కేరాఫ్ కంచ‌ర‌పాలెం నుంచి. అదెలా అంటారా..?

లేటెస్ట్ గా విడుద‌ల‌కు ముందే టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిన సినిమా కేరాఫ్ కంచ‌ర‌పాలెం. తెలుగు తెర‌పై ఎన్నో యేళ్ల త‌ర్వాత ఓ గొప్ప సినిమా వ‌చ్చింద‌న్న అనుభూతిని చూసిన ప్ర‌తి ఒక్క‌రూ పంచుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో ఓ టీనేజ్ బ్యూటీ ఉంది. సినిమాలో త‌న పేరు భువ‌నేశ్వ‌రి. అస‌లు పేరు ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్. త‌ను చూడ్డానికి అచ్చం స‌రితలానే ఉంది. ఫీచ‌ర్స్ మాత్ర‌మే కాదు. యాక్టింగ్ స్కిల్స్ కూడా అలాగే ఉన్నాయి. అంతేనా ప‌ర్స‌నాలిటీ కూడా కాస్త బొద్దుగానే ఉంది. అస‌లు త‌న‌ను వెండితెర‌పై చూడ‌గానే నాటి ప్రేక్ష‌కుల‌కు అరె స‌రిత మ‌ళ్లీ వ‌చ్చిందా అని ఒక్క‌సారిగా షాక్ అయ్యారంటే అతిశ‌యోక్తి కాదు. అంతలా అచ్చంగా స‌రిత‌ను త‌ల‌పిస్తోందీ ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్. త‌న‌లో మంచి టాలెంట్ కూడా ఉంది. కాస్త ప‌ర్స‌నాలిటీ త‌గ్గించుకుంటే త‌ను కూడా స‌రిత‌లా టాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ ముద్ర వేయ‌గ‌ల ప్ర‌తిభ ఉంది. మ‌రి ఈ కొత్త స‌రిత‌కు టాలీవుడ్ లో ఎలాంటి ఆహ్వానాలు ఉంటాయో చూడాలి. అస‌లు త‌నెవ‌రా అని ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో చాలామంది ఆరాలు తీస్తున్నారు. 

More Related Stories