English   

విజయ్ దేవరకొండ కోసం యుద్ధం జరుగుతుంది

Two Star Directors Cold War For Vijay Devarakonda
2018-09-05 20:41:58

ఏం చేస్తాం.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్ అలా ఉంది మ‌రి. ఈయ‌న కోసం స్టార్ డైరెక్ట‌ర్లు కూడా పోటీ ప‌డుతున్నారు ఇప్పుడు. ఇండ‌స్ట్రీలో పేరు మోసిన ఇద్ద‌రు అగ్ర ద‌ర్శ‌కులు ఇప్పుడు ఈ కుర్ర హీరో కోసం యుద్ధం చేస్తున్నారు. అత‌ను నాకు కావాలంటే.. కాదు నాకు కావాలంటూ ఆ ఇద్ద‌రూ పోరు సాగిస్తున్నారు. ఈ విష‌యం తెలిసి విజ‌య్ కూడా సైలెంట్ గా వేడుక చూస్తున్నాడు కానీ ఎవ‌రికి సినిమా చేస్తాన‌ని మాత్రం చెప్ప‌డం లేదు. విజ‌య్ కోసం పోటీ ప‌డుతున్న వాళ్లలో ఒక‌రు వ‌ర‌స విజ‌యాల‌తో దున్నేస్తున్నాడు ఇండ‌స్ట్రీని. మహేష్ లాంటి హీరోకు కూడా రెండు సార్లు హిట్లు ఇచ్చిన ఘ‌నత ఈయ‌న సొంతం. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన అన్ని సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లే. సూప‌ర్ స్టార్స్ తోనూ ప‌ని చేసిన అనుభ‌వం ఆయ‌న సొంతం. అలాంటి ద‌ర్శ‌కుడు ఇప్పుడు విజ‌య్ కోసం లైన్ లో ఉన్నాడు.

మ‌రో ద‌ర్శ‌కుడు మాత్రం కొన్నేళ్లుగా హిట్లు లేక అల్లాడిపోతున్నాడు. ఇలాంటి త‌రుణంలో ఈయ‌న‌కు హిట్ ప‌డాలంటే కావాల్సింది విజ‌య్ అని తెలుసుకుని.. అత‌డి వెంట ప‌డుతున్నాడు. ఒక‌ప్పుడు మహేష్, చ‌ర‌ణ్ లాంటి హీరోల‌కు బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇచ్చిన ఈ అగ్ర ద‌ర్శ‌కుడిని ఇప్పుడు ప‌ట్టించుకునే వారు లేరు. విజ‌య్ కూడా ఈయ‌న్ని లైట్ తీసుకుంటున్నాడు. కార‌ణం ఏదైనా కూడా ఇప్పుడు ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌ను కూడా విజ‌య్ విస్మ‌రిస్తున్నాడు. కానీ వాళ్లు మాత్రం ఎలాగైనా విజ‌య్ దేవ‌ర‌కొండ డేట్స్ తీసుకుని సినిమా చేయాల‌ని చూస్తున్నారు. మ‌రి వాళ్ల కోరిక‌ను ఈయ‌న ఎప్పుడు తీరుస్తాడో చూడాలి..! అస‌లు తీరుస్తాడా అనేది కూడా ఆస‌క్తిక‌ర‌మే. ఎందుకంటే ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్ తో పాటు నోటా.. మారుతి సినిమాతో బిజీగా ఉన్నాడు విజ‌య్. ఈ లైన్ అంతా దాటుకుని వాళ్లు విజ‌య్ ని చేరుకోవాలంటే క‌నీసం రెండేళ్ళు ప‌డుతుంది. మ‌రి అప్ప‌టి వ‌ర‌కు ఆ ఇద్ద‌రు అగ్ర ద‌ర్శ‌కులు ఆగుతారా..?

More Related Stories