English   

రానా కోసం సురేష్ బాబు కొత్త స్టూడియో నిర్మాణం

Producer Suresh Babu Planning to Build a Studio For Rana Daggubati
2018-09-05 21:24:33

తెలుగు ఇండ‌స్ట్రీలో రామానాయుడు కుటుంబానికి ఉన్న ప్ర‌త్యేకథ‌ గురించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక్క‌డ వాళ్ల‌కు లేనిదంటూ లేదు.. అన్నీ వాళ్ల‌కు వాళ్లు సృష్టించుకున్నారు. స్టూడియో.. బ్యాన‌ర్.. నిర్మాణం.. ఇలా ఒక‌దాన్ని మించి అన్నీ ఉన్నాయి. ఇక ఇప్పుడు వీళ్ల కోటాలో మ‌రోటి చేర‌బోతుంది. ఇప్ప‌టికే ఏపీలో వెంకటేష్ ఓ స్టూడియో క‌డుతున్నాడనే వాద‌న ఉంది. అదెలా ఉండ‌బోతుందో తెలియ‌దు కానీ ఇప్పుడు మాత్రం రానా కోసం సురేష్ బాబు ఓ స్టూడియో క‌ట్ట‌బోతున్నాడు. అది కూడా హైద‌రాబాద్ లోనే. స్టూడియో అంటే భారీ రేంజ్ లో కాదు.. ఇంట‌ర్వ్యూల కోసం టీవీ సెట‌ప్ అన్న‌మాట‌. ఇప్పుడు ఏ సినిమా ఇంట‌ర్వ్యూ ఇవ్వాల‌న్నా కూడా ఆయా ఛానెల్స్ కు వెళ్లాల్సి వ‌స్తుంది. రామానాయుడు స్టూడియోలో చేసే స్థలం ఉన్నా.. ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూల కోసమే ఓ స్టూడియో అయితే లేదు.

ఇప్పుడు ఆ అవ‌స‌రం కూడా లేకుండా కొడుకు కోసం ఏకంగా ఓ టీవీ స్టూడియో నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు సురేష్ బాబు. ఇప్ప‌టికే రానా కూడా క్యాస్టింగ్ మేనేజ్ మెంట్ కు సంబంధించిన బిజినెస్ ర‌న్ చేస్తున్నాడు. అంటే బాలీవుడ్ హీరోయిన్ల‌ను ఇక్క‌డ తీసుకురావ‌డం.. వాళ్ల‌కు అవ‌కాశాలు రిఫర్ చేయ‌డం.. అలాగే ఇక్క‌డి హీరోయిన్ల‌కు అక్క‌డ అవ‌కాశాలు ఇప్పించ‌డం అన్న‌మాట‌. దీనికితోడు ఇప్పుడు టీవీ స్టూడియో కూడా వ‌స్తే రానా రేంజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం. ఇందులో కేవ‌లం త‌న సినిమాలు మాత్ర‌మే కాకుండా అంద‌రి సినిమాల ఇంట‌ర్వ్యూలు వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ స్టూడియో కానీ ఓపెన్ అయితే చాలా ఛానెల్స్ స్టూడియోస్ సినిమా వాళ్లు లేక క‌ళ త‌ప్ప‌డం ఖాయం.

More Related Stories