English   

నాని పిల్లోడిని చూసి భయపడ్డాడట

Natural Star Nani Nervous to perform at Devadas Set in front of a Kid
2018-09-05 23:07:04

నాని ఎందుకు భ‌య‌ప‌డ‌తాడు..? ఇప్పుడు ఆయ‌న స్టార్ హీరో క‌దా.. అయినా భ‌య‌ప‌డాల్సినంత త‌ప్పేం చేసాడ‌బ్బా అనుకుంటున్నారా..? ఎవ‌రికైనా ఏదో ఓ టైమ్ లో భ‌యం త‌ప్ప‌దు. ఇప్పుడు నాని విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 ఏళ్లైనా ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించ‌డానికి ఏ రోజు భ‌య‌ప‌డలేదు అని చెప్పాడు నాని. కానీ మొద‌టి సారి ఓ వ్య‌క్తిని చూసి భ‌య‌ప‌డ్డాన‌ని.. ఆయ‌న సెట్స్ లోకి రాగానే చాలా న‌ర్వ‌స్ ఫీల్ అయ్యాన‌ని చెప్పాడు నాని. అంత‌గా నానిని భ‌య‌పెట్టిందెవ‌రో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు.

అత‌డెవరో కాదు.. ఆయ‌న త‌న‌యుడు జున్ను. అవును.. కొడుకు ముందు న‌టించ‌డానికి చాలా కంగారు ప‌డ్డాన‌ని చెప్పాడు న్యాచుర‌ల్ స్టార్. ప‌దేళ్ల ప్ర‌యాణంలో తొలిసారి న‌న్ను ఒక‌డు కెమెరా వెన‌క భ‌య‌ప‌ట్టాడంటూ ట్వీట్ చేసాడు ఈ హీరో. జున్ను సెట్స్ కు వ‌చ్చిన‌పుడు డాక్ట‌ర్ దాస్ కు చెమ‌ట‌లు ప‌ట్టాయ‌ని చెప్పాడు ఈ హీరో. ఈయ‌న ప్ర‌స్తుతం దేవ‌దాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుదల కానుంది. మొత్తానికి నానిని భ‌య‌పెట్టిన ఘ‌న‌త త‌న‌యుడికే ద‌క్కింద‌న్న‌మాట‌.

More Related Stories