English   

అందరికీ ఆ ముగ్గురే...

Keerthy Suresh Rashmika Mandanna Sai Pallavi Upcoming Star Heroines
2018-09-06 00:06:36

ఇండ‌స్ట్రీ ఏదైనా హిట్ల‌లో ఉన్న హీరోయిన్లు అంటే ఉండే క్రేజ్ వేరు. ఇప్పుడు కూడా తెలుగు ఇండ‌స్ట్రీలో ముగ్గురు ముద్దుగుమ్మ‌ల గురించి అలాగే పోటీ ప‌డుతున్నారు హీరోలు. వాళ్లే సాయిప‌ల్ల‌వి.. కీర్తిసురేష్.. ర‌ష్మిక మంద‌న్న‌. ముగ్గురూ ముగ్గురే.. అందం ప్ల‌స్ అభిన‌యంతో అంతా మాయ చేస్తున్నారు. తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఈ ముగ్గురికి ఫుల్ డిమాండ్ న‌డుస్తుంది. వీళ్ళ కోసం కోటి కూడా ఇవ్వ‌డానికి సిద్ధ‌మైపోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పైగా స్టార్ హీరోల మ‌న‌సు కూడా ఈ ముద్దుగుమ్మల‌ వైపు వెళ్తుంది. ఇప్ప‌టికే ఛ‌లో.. గీత‌గోవిందంతో ర‌ష్మిక రేంజ్ మారిపోయింది. కోటి రూపాయ‌ల వైపు ప‌రుగులు తీస్తుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు డియర్ కామ్రేడ్ తో పాటు దేవ‌దాస్ సినిమాల్లో న‌టిస్తుంది ర‌ష్మిక‌. దాంతో పాటే మ‌రో మూడు సినిమ‌ల్లో ఈ భామ‌నే అనుకుంటున్నారు.

ఇక మ‌హాన‌టి త‌ర్వాత కీర్తిసురేష్ రేంజ్ పెరిగిపోయింది. ఈ సినిమా త‌ర్వాత తెలుగులో మ‌రో సినిమా ఒప్పుకోక‌పోయినా కూడా త‌మిళ‌నాట మూడు భారీ సినిమాల్లో న‌టిస్తుంది. విజ‌య్ తో స‌ర్కార్.. విశాల్ తో పందెంకోడి 2.. విక్ర‌మ్ తో సామి 2.. ఈ మూడు సినిమాలు తెలుగులోనూ విడుద‌ల కానున్నాయి. ఇక సాయిప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ భామ ఫిదాతో అంద‌ర్నీ ఫిదా చేసింది. ఎంసిఏతో మాయ చేసింది.. క‌ణంలో న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. ఇప్పుడు తెలుగులో హ‌ను రాఘ‌వ‌పూడి ప‌డిప‌డి లేచే మ‌న‌సు సినిమాలో శ‌ర్వానంద్ తో జోడీక‌ట్టింది. అలాగే నీదినాది ఒకేక‌థ ఫేమ్ వేణు ఉడుగుల-శ‌ర్వానంద్ కాంబినేష‌న్ లో రాబోయే విరాట‌ప‌ర్వం 1992లో కూడా సాయిప‌ల్ల‌వినే హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ఇలా ఈ ముగ్గురు ముద్దుగుమ్మ‌ల కోసం ఇప్పుడు ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తుంది.

More Related Stories