English   

రాజమౌళి కొడుకు నిశ్చితార్థం జరిగింది

Director Rajamouli Son Karthikeya Engaged With Pooja Prasad
2018-09-06 10:27:51

ఎన్నో సినిమాల్లో ప్రేమికుల‌ను తండ్రితో క‌లిపి క‌లిపాడు రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ‌. ఇప్పుడు ఆయ‌న‌కు టైమ్ వ‌చ్చింది. కార్తికేయ ఇప్పుడు త‌న ప్రేమ‌ను గెలిపించుకున్నాడు. త‌ను ప్రేమించిన అమ్మాయితోనే ఏడ‌డుగులు న‌డ‌వ‌బోతున్నాడు. తాజాగా ఈయ‌న నిశ్చితార్థం కూడా జ‌రిగింది. ఈయ‌న త్వరలో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సెప్టెంబ‌ర్ 5న రాజమౌళి నివాసంలో కార్తికేయ నిశ్చితార్థం కుటుంబ స‌భ్యుల మ‌ధ్య‌లో జరిగింది. వధువు మరెవరో కాదు.. ప్రముఖ దర్శక నిర్మాత, జ‌గ‌ప‌తిబాబు తండ్రి వి.బి. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు పూజా ప్రసాద్.

భక్తిగీతాలతో గాయనిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న పూజా ప్రసాద్.. ఇప్పుడు కార్తికేయ‌తో క‌లిసి ఏడ‌డుగులు న‌డ‌వ బోతుంది. జగపతి ఆర్ట్స్ రాజేంద్ర ప్రసాద్ పెద్ద కుమారుడు రాంప్రసాద్ కూతురు ఈమె. అంటే జ‌గ‌ప‌తిబాబు అన్న‌య్య కూతురు అన్న‌మాట‌. పెద్దల అంగీకారంతో జరుగుతున్న ప్రేమ వివాహం అని సన్నిహితులు చెబుతున్నారు. 2018 చివరిలో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కార్తికేయ పెళ్లి బాధ్య‌త అంతా తానే తీసుకుంటున్నాడు రాజ‌మౌళి. అందుకే తాను మొద‌లుపెట్టాల‌నుకున్న మ‌ల్టీస్టార‌ర్ కూడా ఇంకాస్త ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది.

More Related Stories