English   

సోకుల‌తో గేల‌మేయ‌కే.. మెహ్రీన్ క్లీవేజ్ షో..!

Mehreen-Kaur
2018-09-06 16:19:06

ఇండ‌స్ట్రీలో ఎప్పుడు అవ‌కాశాలు త‌గ్గినా కూడా మ‌రో మాట లేకుండా హీరోయిన్లు పాటించే మంత్రం క్లీవేజ్ షో. ఇప్పుడు మెహ్రీన్ కూడా ఇదే చేస్తుంది. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయి.. ఏడాదిన్న‌ర గ్యాప్ తీసుకుని.. త‌ర్వాత నెల రోజుల గ్యాప్ లోనే ఐదు సినిమాల‌తో వ‌చ్చింది ఈ ముద్దుగుమ్మ‌. రాజా ది గ్రేట్ త‌ప్ప మ‌రో హిట్ లేక‌పోయేస‌రికి మ‌ళ్లీ గ్యాప్ తీసుకుంది ఈ భామ‌. ఈ మ‌ధ్య పంతం.. దానికిముందు జ‌వాన్ లాంటి సినిమాల్లో చాలా లావుగా క‌నిపించింది మెహ్రీన్. దాంతో బ‌రువు త‌గ్గించి.. గ్లామ‌ర్ పెంచింది ఈ భామ‌. తాజాగా విడుద‌లైన పిక్స్ లో అమ్మ‌డి న‌వ్వు చూస్తుంటే అబ్బో రాల్తాయేమో న‌వ‌ర‌త్నాలు అన్న‌ట్లుంది. అంత‌గా మెరిసిపోతుంది ఈ భామ‌. ఓ వైపు సింపుల్ గా న‌వ్వుతూనే మ‌రోవైపు అదే ఫోటోల్లో కావాల్సినంత అందాల‌ను కూడా ఒలికిస్తుంది మెహ్రీన్. 

పంతం ఫ్లాప్ అయినా కూడా ఇప్పుడు మెహ్రీన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న ద్విభాషా చిత్రం నోటాలో ఈమె హీరోయిన్. ఇందులో విజ‌య్ తో క‌లిపి లిప్ లాక్ సీన్స్ కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ‌. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తోన్న ఎఫ్ 2లోనూ మెహ్రీన్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇందులో వ‌రుణ్ తేజ్ కు జోడీగా న‌టిస్తుంది ఈ భామ‌. హీరోయిన్ల‌ను రిపీట్ చేసే అల‌వాటు దిల్ రాజుకు బాగా ఉంది. ఓ సారి న‌చ్చితే వ‌ర‌స‌గా అవ‌కాశాలిస్తుంటాడు రాజుగారు. ఇక అనిల్ రావిపూడి కూడా త‌న గ‌త సినిమా హీరోయిన్ల‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ ఆఫ‌ర్లు ఇస్తుంటాడు. ఈ రెండు సినిమాల‌తో పాటు నితిన్-వెంకీ కుడుముల సినిమాలోనూ మెహ్రీన్ హీరోయిన్ గా న‌టించ‌బోతుంది. మొత్తానికి ఈ సినిమాల‌తో మ‌ళ్లీ త‌న కెరీర్ గాడిన ప‌డుతుంద‌ని భావిస్తుంది ఈ భామ‌.      

More Related Stories